ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

"విదేశీ మహిళపై అత్యాచారయత్నం చేసింది.. వైకాపా కార్యకర్తలే" - ఏపీ లేటెస్ట్ అప్​డేట్​

Somireddy Chandramohan reddy: రాష్ట్రంలో రౌడీయిజం పేట్రేగిపోతోందని ధ్వజమెత్తారు తెదేపా నేత సోమిరెడ్డి. నెల్లూరులో విదేశీ మహిళపై అత్యాచారయత్నానికి పాల్పడింది.. వైకాపా కార్యకర్తలేనని ఆరోపించారు.

Somireddy Chandramohan reddy
సోమిరెడ్డి చంద్రమోహన్​రెడ్డి

By

Published : Mar 9, 2022, 6:20 PM IST

Somireddy Chandramohan reddy: నెల్లూరు జిల్లాలో విదేశీ మహిళపై అత్యాచారానికి యత్నించింది.. వైకాపా కార్యకర్తలేనని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో రౌడీయిజం పేట్రేగిపోతోందని ఆయన ధ్వజమెత్తారు. దాడులు ఎదుర్కొని ఫిర్యాదు చేసేందుకు వెళ్లే బాధితుల్ని నిందితులుగా మారుస్తున్నారని ఆరోపించారు. దోషులు ఫిర్యాదు దారులుగా మారుతున్నారన్నా సోమిరెడ్డి.. ఫ్యాక్షన్ రాజకీయాలకు ఇకనైనా ఫుల్​స్టాప్ పెట్టి, పరిపాలన చేయాలని హితవు పలికారు.

సోమిరెడ్డి చంద్రమోహన్​రెడ్డి

Somireddy Chandramohan reddy: మూడేళ్ల తర్వాతైనా వ్యవసాయ, జలవనరులు, ఆర్​ అండ్ బీ శాఖలను తెరవాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రభుత్వానికి సూచించారు. రాష్ట్రంలో ఎన్నో శాఖలు మూతపడ్డాయని విమర్శించారు. ఏపీ కంటే బీహార్ పోలీసులు మెరుగనిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ మేరకు విజయవాడలో సోమిరెడ్డి మీడియాతో మాట్లాడారు.

ఇదీ చదవండి: Rape attempt: నెల్లూరులో దారుణం.. విదేశీ మహిళపై అత్యాచారయత్నం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details