ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సీఎం గారూ.. ఇప్పటికైనా దయచేసి మారండి.. లేదంటే..! - high court

ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని ముఖ్యమంత్రి జగన్​కు.. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సూచించారు. ప్రజా ప్రయోజనాలు కాపాడేలా.. పరిపాలన చేయాలన్నారు.

somireddy

By

Published : Aug 22, 2019, 4:11 PM IST

మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

పోలవరం రివర్స్ టెండరింగ్‌ ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ హై కోర్టు ఇచ్చిన ఆదేశాలపై.. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. ప్రభుత్వ విధానాలకు ఈ తీర్పు శరాఘాతమన్నారు. ఇప్పటికైనా సీఎం జగన్‌ వాస్తవాలు గ్రహించి జాగ్రత్త పడాలని హితవు పలికారు. అభివృద్ధి విషయంలో ప్రతిపక్షంపై కక్షసాధింపు ధోరణి మానుకోవాలన్నారు. 151 స్థానాల్లో ప్రజలు గెలిపిస్తే.. చివరికి పరిశ్రమలు వెళ్లిపోయేలా చేశారని.. ఇతర దేశాలూ పీపీఏల రద్దుపై హెచ్చరించాల్సి వచ్చిందని.. వృద్ధి రేటు పడిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం కంటే మెరుగైన పాలన అందించేందుకు ఇప్పటికైనా దయచేసి ప్రయత్నించాలని.. ప్రభుత్వ విధానాల కారణంగా ప్రజలు నష్టపోయే పరిస్థితి రాకుండా చూడాలని ముఖ్యమంత్రి జగన్​కు విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details