నిరుపేదలకు ప్రభుత్వ పథకాలు చేరేలా సమాజ సేవకులు సహకరించాలని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే విభిన్న సంక్షేమ పథకాలు దారిద్రరేఖకు దిగువనున్న వారికి అందేలా తమవంతు సహకారం అందించాలని కోరారు. వివిధ రంగాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నవారు నిరుపేదల అభ్యున్నతి కోసం ప్రయత్నించాలని అన్నారు. దేశంలోని విభిన్న ప్రాంతాల నుంచి పలు రంగాల్లో సామాజిక సేవను అందిస్తున్న వ్యక్తుల బృందం విజయవాడ రాజ్ భవన్లో గవర్నర్ను కలిసి తాము చేపడుతున్న కార్యక్రమాలను గురించి వివరించారు. ఈ సందర్భంగా గవర్నర్ వారితో ప్రత్యేకంగా మాట్లాడారు.
"నిరుపేదలకు ప్రభుత్వ పథకాలు చేరేలా... సమాజ సేవకులు సహకరించాలి" - విజయవాడ లేటెస్ట్ అప్డేట్స్
నిరుపేదలకు ప్రభుత్వ పథకాలు చేరేలా సమాజ సేవకులు సహకరించాలని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పిలుపునిచ్చారు. వివిధ రంగాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నవారు నిరుపేదల అభ్యున్నతి కోసం ప్రయత్నించాలని అన్నారు.
సమాజంలో అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు. ప్రత్యేకించి అవగాహన లేమితో ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్న వారికి అవగాహన కల్పించి వారు వాటిని పొందగలిగేలా తోడ్పాటును అందించాలన్నారు. గవర్నర్ను కలిసిన వారిలో పారిశ్రామికవేత్తలు, వైద్యనిపుణులు, భారత స్కౌట్స్, గైడ్స్ ప్రతినిధులు, పాత్రికేయులు, ఉపాధ్యాయిలు, కళాకారులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పి.సిసోడియా, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: Audio Viral: చెవిరెడ్డి పల్లెబాట విజయవంతానికి తంటాలు.. మహిళా సంఘాలకు బెదిరింపులు