ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ప్రతిపక్షాల విమర్శలు, ఆరోపణలపై జవాబు దారితనంతో వ్యవహరించాలి' - సామాజిక ఉద్యమకారుడు టి. లక్ష్మీనారాయణ తాజా వార్తలు

తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు, పట్టాభి ఇంటిపై దాడి, విధ్వంసం సృష్టించడం తీవ్రంమైన చర్యగా సామాజిక ఉద్యమకారుడు టి.లక్ష్మీనారాయణ అభివర్ణించారు. ఈ తరహా దాడులను ఆయన ఖండింస్తున్నట్లు చెప్పారు.

సామాజిక ఉద్యమకారుడు టి.లక్ష్మీనారాయణ
సామాజిక ఉద్యమకారుడు టి.లక్ష్మీనారాయణ

By

Published : Oct 20, 2021, 6:41 AM IST

రాష్ట్రంలో అధికార పార్టీ శ్రేణులు.. తెదేపా కేంద్ర కార్యాలయం, పార్టీ నేతలపై దాడులను సామాజిక ఉద్యమకారుడు టి.లక్ష్మీనారాయణ ఖండించారు. పార్టీ కార్యాలయాలు, పట్టాభి ఇంటిపై దాడి, విధ్వంసం సృష్టించడం తీవ్రంమైన చర్యగా ఆయన అభివర్ణించారు. తీవ్రస్థాయిలో చర్చనీయాంశంగా ఉన్న డ్రగ్స్, గంజాయి సమస్యపై ప్రతిపక్ష నాయకుల విమర్శలు, ఆరోపణలపై ప్రభుత్వం బాధ్యతగా స్పందించి జవాబు దారితనంతో చర్యలు తీసుకోవాలన్నారు. విమర్శలు నిర్మాణాత్మకంగా, సద్వివిమర్శలుగా ఉండేలా సంయమనం కోల్పోకుండా విమర్శలు చేయాల్సిన బాధ్యతను ఎవ్వరూ విస్మరించకూడదన్నారు.

విమర్శలు చేస్తే భౌతిక దాడులు చేసే అప్రజాస్వామిక చర్యలకు అధికార పార్టీ శ్రేణులు పాల్పడితే.. శాంతి భద్రల సమస్యకు వారే ఆజ్యం పోసివారు అవుతారని హెచ్చరించారు. డీజిపీ కార్యాలయం పక్కనే ఉన్న తెదేపా కేంద్ర కార్యాలయంపైనే దాడి చేస్తే నివారించలేని దుస్థితి దేనికి అద్దం పడుతున్నదో ప్రభుత్వం తీవ్రంగా ఆలోచించాలన్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని.. ప్రభుత్వం తక్షణం స్పందించి బాధ్యులను కఠినంగా శిక్షించాలని.. ఈ తరహా అవాఛనీయమైన ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

ఇదీ చదవండి.. :రాష్ట్రవ్యాప్తంగా తెదేపా కార్యాలయాలపై వైకాపా శ్రేణుల దాడులు..ఉద్రిక్తత

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details