ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Snow in Vijayawada: విజయవాడ నగరాన్ని కప్పేసిన మంచు - విజయవాడ తాజా వార్తల సమాచారం

snow at vijayawada: వాతావరణంలో మార్పుల కారణంగా గత మూడు రోజుల నుంచి విజయవాడ నగరాన్ని మంచు కప్పేసింది. రోడ్లన్నీ మంచుతో మూసుకుపోవడం వల్ల వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

snow at vijayawada
విజయవాడ నగరాన్ని కప్పేసిన మంచు

By

Published : Feb 24, 2022, 10:33 AM IST

snow at vijayawada: గత మూడు రోజుల నుంచి వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులతో విజయవాడ నగరవ్యాప్తంగా మంచు కప్పేసింది. నగరంతో పాటు చుట్టుపక్కల గ్రామాలు సైతం మంచుతో నిండి ఉన్నాయి. ఉదయం 9 గంటల వరకు రోడ్లన్నీ మంచుదుప్పటి పరుచుకున్నట్లు ఉన్నాయి.

రోడ్లన్నీ మంచుతో కప్పబడి ఉండటం వల్ల వాహనదారులు నెమ్మదిగా ప్రయాణిస్తున్నారు. రహదారి కనిపించకుండా ఉండటంతో వాహనం లైట్లు వేసుకుని ప్రయాణిస్తున్నారు. చలికి బయటకు వచ్చేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details