Smoke from roadside water puddle: విజయవాడ మధురానగర్‌లో రోడ్డు పక్కనున్న నీటిగుంత నుంచి పొగలు రావడం కలకలం రేపింది. గద్దె వెంకటరామయ్య వీధి సమీపంలో ఈ ఘటన జరిగింది. పొగలు ఎందుకు వచ్చాయన్నది తెలియక స్థానికులు ఆందోళన చెందారు. అందరిలోనూ ఏం జరుగుతుందోనన్న టెన్షన్ మొదలైంది. అయితే రోడ్డు కిందనున్న గ్యాస్ పైపులైన్ లీక్ కావడం వల్లే పొగలు వస్తున్నట్లు అనుమానిస్తున్నారు.
రోడ్డు పక్కన నీటిగుంతలో పొగలు.. భయాందోళనలో స్థానికులు - రోడ్డుపక్కన నీటి గుంత నుంచి పొగలు
Smoke from roadside water puddle: అక్కడ ఎవరి పనుల్లో వారు బిజీబిజీగా ఉన్నారు... అంతలోనే రోడ్డుపక్కన ఉన్న నీటిగుంతలో నుంచి పొగలు వస్తున్నాయి. అంతే అందరి దృష్టి ఆ పొగలపై పడ్డాయి. ఏం జరుగుతుందోనన్న టెన్షన్ అందరిలోనూ మొదలైంది. ఈ విషయం తెలుసుకుని పలువురు అక్కడకు చేరుకున్నారు.
![రోడ్డు పక్కన నీటిగుంతలో పొగలు.. భయాందోళనలో స్థానికులు Smoke](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16496719-1055-16496719-1664366240272.jpg)
నీటి గుంత నుంచి పొగ