ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Smart Cities: కేంద్రం అభ్యంతరం.. స్మార్ట్ సిటీ ఛైర్మన్లు రాజీనామా - స్మార్ట్ సిటీ ఛైర్మన్లు రాజీనామా వార్తలు

విశాఖ, తిరుపతి, కాకినాడ, ఏలూరు స్మార్ట్ సిటీ ఛైర్మన్లు రాజీనామా చేశారు. స్మార్ట్ సిటీలకు నామినేటెడ్ నియామకాలు చెల్లవని రాష్ట్రానికి కేంద్రం లేఖ రాసింది. ఈ మేరకు వారిచే రాష్ట్ర ప్రభుత్వం రాజీనామా చేయించింది.

స్మార్ట్ సిటీ ఛైర్మన్లు రాజీనామా
స్మార్ట్ సిటీ ఛైర్మన్లు రాజీనామా

By

Published : Mar 22, 2022, 7:21 PM IST

తిరుపతి, ఏలూరు, విశాఖ, కాకినాడ స్మార్ట్ సిటీ ఛైర్మన్లు రాజీనామా చేశారు. రాష్ట్ర పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేయటంతో.. విశాఖ స్మార్ట్ సిటీ ఛైర్మన్ జి.వెంకటేశ్వరరావు, తిరుపతి ఛైర్‌పర్సన్ ఎన్.పద్మజ, కాకినాడ ఛైర్మన్ ఎ.రాజుబాబు, ఏలూరు ఛైర్‌పర్సన్ బి.అఖిల రాజీనామా చేశారు.

స్మార్ట్ సిటీలకు నామినేటెడ్ నియామకాలు చెల్లవని డిసెంబరులో..రాష్ట్రానికి కేంద్రం లేఖ రాసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

ఇదీ చదవండి : Jagga Reddy About Revanth : 'రేవంత్ నాకు ఝలక్ ఇవ్వడం కాదు.. నేనే ఇస్తా'

ABOUT THE AUTHOR

...view details