తెరాస: బస్తీలు, మురికివాడల్లోని ఓటర్లు తమకే మద్దతు పలుకుతారని తెరాస ముఖ్యులు విశ్వసిస్తున్నారు. ప్రచారంపై ఇప్పటికే కేటీఆర్ కేడర్‌కు దిశా నిర్దేశం చేశారు. సంక్షేమ పథకాలు, రెండు పడక గదుల ఇళ్లపై విస్తృతంగా ప్రచారం నిర్వహించే బాధ్యతను ఎమ్మెల్యేలు, సిట్టింగ్ కార్పొరేటర్లు, డివిజన్ స్థాయి నాయకులకు ప్రత్యేకంగా అప్పగించారు.
ప్రచారాస్తాలు: వరద సాయం పంపిణీ నిలిచిపోవడానికి ప్రతిపక్షాలే కారణమనే వాణిని ఓటర్లలోకి తీసుకెళ్తున్నారు. రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం ఎంత వరకొచ్చిందనేది వివరిస్తున్నారు.
భాజపా: గెలిచేందుకు అవకాశమున్న డివిజన్ల పరిధిలోకొచ్చే మురికివాడలు, బస్తీల జాబితాను భాజపా ఇప్పటికే తయారు చేసింది. ఆయా ప్రాంతాల్లో ఏబీవీపీ, ఆర్‌ఎస్‌ఎస్, బీఎంఎస్ తదితర అనుబంధ సంఘాల కార్యకర్తలు విస్తృతంగా పర్యటించేలా ప్రణాళికలు రూపొందించారు. ప్రచార సరళిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వారికి దిశా నిర్దేశం చేసే బాధ్యతను సీనియర్ నాయకులకు అప్పగించారు.
ప్రచారాస్త్రం: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో కేంద్రం వాటా, వరద సాయం పంపిణీలో అవకతవకలు, నిలుపుదల, రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణంలో జాప్యం తదితర అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు.
కాంగ్రెస్:అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ ప్రచార తారలను రప్పించి.. డివిజన్‌లో పాదయాత్రలుగా తిరుగుతున్నారు. పైవంతెనలు, ఐటీ కంపెనీలు, రహదారులు అంటూ బస్తీలు, మురికివాడలను నిర్లక్ష్యం చేసిందనే అంశాన్ని బలంగా తీసుకెళ్లేలా ఏర్పాట్లు చేసుకుంటుంది. కొన్ని చోట్లకు ప్రధాన నేతలు రాకపోవడంతో అభ్యర్థులే బస్తీ నేతలతో మంతనాలు జరుపుతున్నారు.