తెలంగాణ రాష్ట్రంలో పలుచోట్ల భూమి స్వల్పంగా కంపించింది. మధ్యాహ్నం 2 గంటల 3 నిమిషాల సమయంలో భూమి కంపించింది. భూకంపలేఖినిపై తీవ్రత 4గా నమోదైందని అధికారులు తెలిపారు. కరీంనగర్‌కు ఈశాన్యంగా 45 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. మంచిర్యాల జిల్లాలో పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. మంచిర్యాల, రాంనగర్, నస్పూర్, గోసేవ మండల్ కాలనీలో భూమి కంపించింది. భూమి కదలికలు గమనించిన స్థానికులు భయాందోళనతో ఇళ్లలో నుంచి పరుగులుతీశారు.
EARTH QUAKE: తెలంగాణలో పలుచోట్ల కంపించిన భూమి..పరుగులు తీసిన ప్రజలు - Telangana earthquake
తెలంగాణ రాష్ట్రంలో పలుచోట్ల భూమి స్వల్పంగా కంపించింది. కరీంనగర్‌కు ఈశాన్యంగా 45 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూమి కదలికలు గమనించిన స్థానికులు భయాందోళనతో ఇళ్లలో నుంచి పరుగులు తీశారు.
తెలంగాణలో స్వల్ప భూకంపం