ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

డోర్ డెలివరీ వాహనాల్లో రూ. 63 కోట్లు ఆదా: పౌరసరఫరాల శాఖ - డోర్ డెలివరీ వాహనాలలో రివర్స్ టెండరింగ్

రాష్ట్రప్రభుత్వం అనుసరిస్తున్న రివర్స్‌ టెండరింగ్ ప్రక్రియ వల్ల డోర్ డెలివరీ వాహనాల కొనుగోలుపై రూ. 63 కోట్ల రూపాయలు ఆదా అయినట్లు అధికారులు తెలిపారు. టాటామోటార్స్ సంస్థ ఈ టెండర్​ను దక్కించుకుందని చెప్పారు.

door delivery vehicles
డోర్ డెలివరీ వాహనాలు

By

Published : Oct 16, 2020, 12:52 PM IST

రాష్ట్రప్రభుత్వం అనుసరిస్తున్న రివర్స్‌ టెండరింగ్ ప్రక్రియ వల్ల పౌరసరఫరాల శాఖ కొనుగోలు చేయనున్న డోర్ డెలివరీ వాహనాలకు రూ. 63 కోట్ల రూపాయలు ఆదా అయినట్లు ఆ శాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రేషన్ సరకులను ప్రజల ఇళ్ల వద్దకు తీసుకువెళ్ళి, అందించాలన్న ప్రభుత్వ నిర్ణయం మేరకు ఈ వాహనాలు కొనుగోలు చేయనున్నట్లు స్పష్టం చేశారు.

మొత్తం 9260 డోర్ డెలివరీ వాహనాల కొనుగోలుకు టెండర్లు ఆహ్వానించామని... సుజుకీ, టాటామోటార్స్‌ వంటి సంస్థలు బిడ్‌ దాఖలు చేసినట్లు తెలిపారు. ఈ బిడ్‌లపై 2 వారాల కిందట జ్యుడీషయల్ ప్రివ్యూ పూర్తైందని చెప్పారు. కేంద్రప్రభుత్వ పరిధిలోని గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ (గెమ్) పోర్టల్‌లో నిర్వహించిన రివర్స్‌ టెండరింగ్​లో టాటామోటార్స్ సంస్థ సుజుకీ కన్నా తక్కువ రేట్‌ కోట్ చేసి బిడ్‌ దక్కించుకున్నట్లు వివరించారు.

మొదట ఒక్కో వాహనానికి రూ.6.60 లక్షలు కోట్ చేసిన టాటా మోటార్స్.. రివర్స్‌ బిడ్డింగ్​లో రూ. 5,72,539 లక్షలకు ధరను కోట్ చేసిందని చెప్పారు. దీనివల్ల ఒక్కో వాహనంపై సుమారు రూ.67,460 రూపాయల వరకు తగ్గిందని.. పోటీ సంస్థ కన్నా తక్కువకు వాహనాలు ఇచ్చేందుకు ముందుకు రావటంతో టాటామోటార్స్‌ బిడ్‌కు ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు.

ఇవీ చదవండి..

పెళ్లికి పెద్దలు నిరాకరించారని ప్రేమజంట ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details