విజయవాడ నగరంలో ఆన్‌లైన్ ద్వారా క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఆరుగురిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు(cricket betting gang arrest) చేశారు. భారత్, పాకిస్థాన్ టీ-20 ప్రపంచకప్ సమయంలో సత్యనారాయణపురం, భవానీపురం, సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ల పరిధిలోని బెట్టింగ్ వ్యవహారంపై పోలీసులు నిఘా ఉంచారు. ఈ క్రమంలో సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీనగర్‌లో ఓ హోటల్ గదిలో క్రికెట్ బెట్టింగ్ జరుపుతున్నట్లు అందిన సమచారం మేరకు పోలీసులు తనిఖీ చేపట్టారు. ఆరుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. బుకీలుగా ఉన్న 11 మంది నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
భవానీపురం, సూర్యాపేట పోలీస్ స్టేషన్ల పరిధిలోనూ ఇదే తరహాలో బెట్టింగ్‌కు పాల్పడుతున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి టీవీ, ట్యాప్‌టాప్, సెటాప్‌బాక్స్, 12 చరవాణీలు స్వాధీనం(cricket betting gang arrest at Vijayawada) చేసుకున్నారు.