విజయవాడ నగర శివారు కొత్తూరు తాడేపల్లి గోసంరక్షణ కేంద్రంలో చోటుచేసుకున్న గోవుల మృతి ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ బృందం విచారణ వేగవంతం చేసింది. బృంద సభ్యలు ఘటన జరిగిన ప్రాంతాన్ని నిశితంగా పరిశీలించారు. సీసీఎస్ ఏసీపీ శ్రీనివాస రావు నేతృత్వంలో సిబ్బంది గోశాలలోని మట్టి నమునా, ఇతర ఆధారాలను సేకరించారు. గోవులు మృతి చెందడానికి ముందు రోజు వాటికి ఎలాంటి ఆహారం పెట్టారన్న అంశాలపై విచారణ చేపట్టారు. దాణా ఎక్కడి నుంచి తెప్పించారన్న దానిపై గోశాల నిర్వాహకులను ప్రశ్నించారు.
గోవుల మృతిపై సిట్ విచారణ వేగవతం - death of the cows
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తాడేపల్లి గోసంరక్షణ కేంద్రంలో గోవుల మృతిపై సిట్ బృందం విచారణ వేగవంతం చేసింది. గోశాలను సందర్శించి వివరాలను, ఆధారాలను సేకరించింది.
![గోవుల మృతిపై సిట్ విచారణ వేగవతం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4137899-963-4137899-1565799833058.jpg)
సిట్ విచారణ వేగవతం