ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'కాటన్ జయంత్యుత్సవం : గోదావరి జిల్లాల హృదయాల్లో ఆయన ఎప్పటికీ దేవుడే' - సర్ ఆర్థర్ కాటన్ జయంతి

గోదావరి జిల్లాల ప్రజల హృదయాల్లో సర్ ఆర్థర్ కాటన్ నిలిచిపోయారని అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి కీర్తించారు. కాటన్ జయంతి పురస్కరించుకుని అనపర్తిలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

sir arthur cotton
సర్ ఆర్డర్ కాటన్ జన్మదిన వేడుకలు

By

Published : May 16, 2021, 11:17 AM IST

అపర భగీరథుడు, డెల్టా రూప శిల్పి సర్ ఆర్థర్ కాటన్ అందించిన సేవలు చిరస్మరణీయమని.. అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి కొనియాడారు. ఈ సందర్భంగా కాటన్ జయంతిని పురస్కరించుకుని అనపర్తిలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గోదావరి జిల్లాల ప్రజల హృదయాల్లో కాటన్ ఎప్పటికీ దేవుడుగానే నిలుస్తాడని ఎమ్మెల్యే తెలిపారు.

'ఆయన కృషి అనిర్వచనీయం'

కాటన్ జయంతి సందర్భంగా మోపిదేవిలోని విగ్రహానికి అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు పూలమాలలు వేసి ఘన నివాళులు సమర్పించారు. తెలుగు ప్రజల మనసుల్లో ఎప్పటికీ నిలిచిపోయే అభిమానాన్ని సంపాదించుకున్నాడని గుర్తు చేసుకున్నారు. దివిసీమకు నీరందించేందుకు ఆయన చేసిన కృషి మరువలేనిదన్నారు.

ABOUT THE AUTHOR

...view details