ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సింహాచలం, మాన్సాస్ ట్రస్టు భూముల వివాదంపై దర్యాప్తునకు ఆదేశం - మాన్సాస్ ట్రస్టు భూముల వ్యవహారం

సింహాచలం, మాన్సాస్ ట్రస్టు భూముల వివాదంపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 3 నెలల్లోగా నివేదిక ఇవ్వాలని విజిలెన్స్‌ విభాగాన్ని ఆదేశిస్తూ ఉత్తర్వులు వెలువరించింది.

సింహాచలం, మాన్సాస్ ట్రస్టు భూముల ఆరోపణలపై దర్యాప్తునకు ఆదేశం
Simhachalam, Mansas Trust orders into land allegations

By

Published : Aug 9, 2021, 7:59 PM IST

సింహాచలం, మాన్సాస్ ట్రస్టు భూముల వివాదంపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 3 నెలల్లోగా నివేదిక ఇవ్వాలని విజిలెన్స్‌ విభాగాన్ని ఆదేశిస్తూ ఉత్తర్వులు వెలువరించింది. సింహాచలం భూములను ఆస్తులు రిజిస్ట్రీ నుంచి తొలగించటం, మాన్సాస్ ట్రస్ట్‌ భూముల విక్రయంపై విజిలెన్స్ దర్యాప్తు చేస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. గతంలో ఈవోగా చేసిన రామచంద్రమోహన్‌పై ఇప్పటికే సస్పెన్షన్ వేటు పడిందని.. అధికారుల కమిటీ నివేదిక మేరకు చర్యలు తీసుకున్నామని తెలిపింది.

ఈ వ్యవహారంలో మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకే విజిలెన్స్‌ విచారణకు ఆదేశించామని వెల్లడించింది. ముగ్గురు సభ్యుల కమిటీ సిఫారసు మేరకే దర్యాప్తునకు ఆదేశించినట్లు తెలిపింది. సమాచారం ఇచ్చేందుకు నోడల్ అధికారిగా దేవాదాయశాఖ కమిషనర్​ను నియమించామని ప్రభుత్వం స్పష్టం చేసింది. విజిలెన్స్‌ విభాగం సమాచారంతో మాన్సాస్‌ ట్రస్టులో తనిఖీ చేయవచ్చని సూచించింది. ఈ మేరకు దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి వాణీమోహన్ ఉత్తర్వులు జారీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details