ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో 9 భారీ పరిశ్రమలు - ఎస్​ఐపీబీ వార్తలు

రాష్ట్రంలో రూ.18 వేల కోట్ల పెట్టుబడులతో తొమ్మిది భారీ పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. శుక్రవారం నిర్వహించే రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎస్‌ఐపీబీ) సమావేశంలో ప్రభుత్వం వాటికి ఆమోదం తెలపనుంది. వాటికి ఇచ్చే ప్రోత్సాహకాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఛైర్మన్‌గా నిర్వహించిన రాష్ట్రస్థాయి పెట్టుబడుల కమిటీ (ఎస్‌ఐపీసీ)లో అధికారులు చర్చించారు. వీటితోపాటు శ్రీసిటీలో జపాన్‌కు చెందిన పది పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. వాటి ద్వారా మరో రూ.6 వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయి. శ్రీసిటీ యాజమాన్యం ఇప్పటికే సంబంధిత సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పరిశ్రమల శాఖ వర్గాలు తెలిపాయి.

sibp proposal to 9 industries in andhrapradesh
sibp proposal to 9 industries in andhrapradesh

By

Published : Jun 2, 2020, 5:50 AM IST

రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచినా ఇప్పటివరకు ఎస్‌ఐపీబీ సమావేశం నిర్వహించలేదు. ఎస్‌ఐపీబీలో పరిశ్రమలకు ఇవ్వాల్సిన రాయితీలు, భూములకు సంబంధించి ప్రభుత్వం అంగీకారం తెలపాలి. దీనివల్ల పారిశ్రామికవేత్తలతో సంప్రదింపులు పూర్తయినా అనుమతుల జారీ ప్రక్రియ నిలిచిపోయింది. శుక్రవారం నిర్వహించే ఎస్‌ఐపీబీ తొలి భేటీలో వాటిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది.

  • భారీ పరిశ్రమల రాక

అలయన్స్‌ టైర్‌ గ్రూప్‌(ఏటీజీ)నకు చెందిన ఏటీసీ టైర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, షాన్‌ షూ కేసింగ్‌, ట్రీన్‌ టెక్‌, గ్రీన్‌ ప్లై, చైనా రైల్వే రోలింగ్‌ స్టాక్‌ కార్పొరేషన్‌ (సీఆర్‌ఆర్‌సీ), శ్రీకాళహస్తి పైప్స్‌, గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌.. వంటి భారీ పరిశ్రమలతో జాబితాను ఎస్‌ఐపీబీ ఆమోదం కోసం సిద్ధం చేశారు.

* అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో ఆయా పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి.

* ఎస్‌ఐపీబీ ఆమోదం లభించగానే వాటితో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంటామని పరిశ్రమల శాఖ అధికారులు తెలిపారు

ABOUT THE AUTHOR

...view details