ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Shortage of Musical Instrument Veena Makers : తయారీదారులు లేక మూగబోతున్న వీణ... - Veena music

Shortage of Musical Instrument Veena Makers : మనసులను మీటే స్వరాలను పలికించి...అణువణువూ పులకింపజేసే వాయిద్యమది. మదిని దోచి సంగీత సాగరంలో ఓలలాడించే పరికరమది. మనుషుల ఒత్తిళ్లను, భావోద్వేగాలను నియంత్రిస్తూ...స్పందన కలిగించే శక్తిగల అద్భుతమది. అదే సంగీత ప్రపంచాన తనకంటూ ప్రత్యేకత చాటుకున్న ప్రసిద్ధ వాయిద్య పరికరం "వీణ"...కానీ నేడు రాను రానూ..వీణ తయారీ కనుమరుగయ్యే స్థితికి పరిస్థితులు చేరుతున్నాయి.

Shortage of Musical Instrument Veena Makers
తయారీదారులు లేక మూగబోతున్న వీణ...

By

Published : Dec 23, 2021, 11:16 AM IST

తయారీదారులు లేక మూగబోతున్న వీణ...

Shortage of Musical Instrument Veena Makers : మనసులను మీటే స్వరాలను పలికించి...అణువణువూ పులకింపజేసే వాయిద్యమది. మదిని దోచి సంగీత సాగరంలో ఓలలాడించే పరికరమది. మనుషుల ఒత్తిళ్లను, భావోద్వేగాలను నియంత్రిస్తూ...స్పందన కలిగించే శక్తిగల అద్భుతమది. అదే సంగీత ప్రపంచాన తనకంటూ ప్రత్యేకత చాటుకున్న ప్రసిద్ధ వాయిద్య పరికరం "వీణ"...కానీ నేడు రాను రానూ..వీణ తయారీ కనుమరుగయ్యే స్థితికి పరిస్థితులు చేరుతున్నాయి.

కృష్ణా జిల్లాలోని నూజివీడు మామిడి పండ్లతో పాటు వీణల తయారీకి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ తయారు చేసే వీణలకు దేశంలోనే కాదు విదేశాలలోనూ మంచి డిమాండ్‌ ఉండేది. రాజులకాలం నుంచి కళాకారులు వీటిని తయారుచేస్తున్నారు. ఇప్పటికీ ఇదే వృత్తిని కొనసాగిస్తున్నారు. వీణ తయారీలో ప్రావీణ్యం సాధించిన కొందరికి అత్యున్నత పురస్కారాలు కూడా లభించాయి. కానీ.. ప్రస్తుతం పరిస్థితి తలకిందులైంది. తరతరాలుగా వీణ తయారీ కులవృత్తిగా ఉన్న కళాకారులకు బతుకు భారంగా మారింది. కుటుంబాలను పోషించుకోలేని దీనస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.

వీణ తయారీ చాలా నిష్టతో కూడిన పని. ఈ పనిని నేర్చుకోవడానికి ఇప్పుడు ఎవ్వరూ ముందుకు రావడం లేదు. భవిష్యత్తులో ఈ కళ అంతరించి పోతుందని చెప్పడానికి ఇదే నిదర్శనం. ఇప్పటికే చాలామంది వీణ తయారీ వృత్తిని వదిలిపెట్టేశారు. తమ పిల్లలకు కూడా కళాకారులు ఈ కళను నేర్పించడం లేదు. వారసత్వంగా వస్తున్న కులవృత్తిపై మమకారం చంపుకోలేక కొందరు ఇంకా కొనసాగుతున్నారు. నమ్ముకున్న వృత్తి ఇప్పుడు తమకు అన్నం పెట్టలేకపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆదాయం లేకపోయినా తరతరాలుగా వస్తున్న కళపై మమకారంతో ఇందులోనే జీవనం సాగిస్తున్న యువ కళాకారులు చేయూత కోసం చూస్తున్నారు. చేతి వృత్తులకు సాయం చేస్తామని చెబుతున్న ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని అంటున్నారు.

ప్రభుత్వం తమను ఆదుకోవాలని, ప్రాచీన కళకు జీవం పోయాలని.... నూజివీడు వీణ తయారీ కళాకారులు వేడుకుంటున్నారు.

ఇదీ చదవండి: TIRUPATAMMA TEMPLE : తిరుపతమ్మ దేవాలయం హుండీ లెక్కింపు

ABOUT THE AUTHOR

...view details