ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Shilpa Chowdary cheating case: శిల్పా చౌదరికి మరోసారి పోలీసు కస్టడీ - Shilpa Chowdary police custody

శిల్పా చౌదరిని ఉప్పర్ పల్లి కోర్టు మరోసారి పోలీసు కస్టడీకి అనుమతించింది. దర్యాప్తులో పురోగతి కోసం కస్టడీకి అనుమతించాలని నార్సింగి పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

shilpa-chaudhary
shilpa-chaudhary

By

Published : Dec 9, 2021, 6:25 PM IST

Shilpa Chowdary cheating case: పెట్టుబడులు, అధిక వడ్డీల పేరుతో మోసానికి పాల్పడిన కేసులో శిల్పా చౌదరిని ఉప్పర్ పల్లి కోర్టు మరోసారి పోలీసు కస్టడీకి అనుమతించింది. దర్యాప్తులో పురోగతి కోసం కస్టడీకి అనుమతించాలని నార్సింగి పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శిల్పపై ఉన్న కేసుల గురించి.. డబ్బులు వసూలు చేసిన వైనం గురించి తెలుసుకోవాల్సి ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో... కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రేపటి నుంచి మూడు రోజుల పాటు శిల్పను నార్సింగి పోలీసులు ప్రశ్నించనున్నారు.

పలువురికి నోటీసులు
ఇప్పటికే శిల్పపై మూడు కేసులు నమోదు కావడంతో రూ. 7 కోట్లకు పైగా వసూలు చేసి తిరిగి చెల్లించలేదనే విషయం పోలీసుల దర్యాప్తులో తేలింది. కేసు దర్యాప్తులో భాగంగా నార్సింగి పోలీసులు రెండు రోజుల కస్టడీకి తీసుకొని విచారించినా... పెద్దగా సమాధానం చెప్పలేదు. ఇతరుల నుంచి తీసుకున్న డబ్బులు స్థిరాస్తి వ్యాపారంలో పెట్టుబడి పెట్టినట్లు శిల్ప పోలీసులకు తెలిపింది. స్పష్టమైన వివరాలు చెప్పకపోవడంతో పోలీసులు మరోసారి ఆమెను ప్రశ్నించనున్నారు. శిల్ప బ్యాంకు లావాదేవీలతో పాటు ఆమె ఇంట్లో సేకరించిన పత్రాల ఆధారంగా పోలీసులు పలువురికి నోటీసులిచ్చారు. వాళ్ల నుంచి కూడా నార్సింగి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

ఇదీ చదవండి:cm jagan review on projects: రాష్ట్రంలోని ప్రాజెక్టుల భద్రతను పరిశీలించండి : సీఎం జగన్​

ABOUT THE AUTHOR

...view details