ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఏపీ కాంగ్రెస్ మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా షాలీ దాదా ప్రమాణం - కాంగ్రెస్ మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా షాలీ దాదా గాంధి విజయవాడలో ప్రమాణం

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా షాలీ దాదా గాంధీ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలో జరిగిన ఈ కార్యక్రమానికి.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శైలజానాథ్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఏపీలో మైనారిటీలను ఏకతాటిపైకి తీసుకువచ్చి.. వారికి జరుగుతున్న అన్యాయాలను వివరిస్తానని గాంధీ తెలిపారు.

shali dada gandhi oath taking as ap congress minority cell president in vijayawada
ఏపీ కాంగ్రెస్ మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా షాలీ దాదా విజయవాడలో ప్రమాణం

By

Published : Jan 31, 2021, 6:42 PM IST

విజయవాడ ఆంధ్రరత్న భవన్​లో.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా షాలీ దాదా గాంధీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే శైలజానాథ్.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతపురం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా.. పదేళ్లపాటు విశేష కృషి చేశారని ఆయన కొనియాడారు. అందుకు గుర్తింపుగా రాష్ట్ర మైనార్టీ విభాగం అధ్యక్షుడిగా అధిష్ఠానం నియమించిందని తెలిపారు.

లౌకిక భావజాలంతో కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందని.. కొన్ని శక్తులు మతాల మధ్య విభేదాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాయని శైలజానాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో పునర్ వైభవం తీసుకురావడానికి సమష్టి కృషితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కేంద్రంలోని భాజపా, రాష్ట్రంలోని వైకాపా.. మైనారిటీల ఓట్లు దండుకుని వారిని అణగతొక్కుతున్నాయని షాలీ దాదా గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. మైనారిటీలందరిని ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తానన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details