విజయవాడ ఇంద్రకీలాద్రిపై శాకంబరీ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వివిధ రకాల కూరగాయలతో అమ్మవారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. భాగ్యనగర్ మహంకాళి బోనాల జాతర ఉత్సవ కమిటీ సభ్యులు... అమ్మవారికి బంగారు బోనాలు, పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఉదయం 11.30 గంటలకు బ్రాహ్మణవీధి, జమ్మిదొడ్డి నుంచి ఘాట్‌రోడ్డు మీదుగా ఆలయం వరకు బోనాలతో కళాకారుల ప్రదర్శనలు ఉంటాయి.
ఇంద్రకీలాద్రిపై శాకంబరీ ఉత్సవాలు ప్రారంభం
ఇంద్రకీలాద్రిపై శాకంబరీ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. వివిధ రకాల కురగాయాలతో అమ్మవారిని ఆలయాధికారులు అలంకరించారు.
ప్రారంభమైన ఇంద్రకీలాద్రిపై శాకంబరీ ఉత్సవాలు