కష్టాన్ని కష్టం అని చెప్పుకోలేని దుర్మార్గమైన కాలంలో ఉన్నామని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ వ్యాఖ్యానించారు. అధికారంలోకి రాకముందు ఉచిత విద్యుత్ అని చెప్పి మోటార్లకు మీటర్లు బిగిస్తామని వైకాపా ప్రభుత్వం మాట మార్చిందని మండిపడ్డారు. మాయ మాటలతో ఎంతో కాలం ప్రజలను మోసం చేయలేరన్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో ఉద్యమిస్తున్న రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ మద్దతుదారులను విజయవాడలో సత్కరించిన ఆయన... కష్ట కాలంలోనూ పోరాటపటిమ చూపించారని అభినందించారు.
మాయ మాటలతో ఎంతో కాలం మోసం చేయలేరు: శైలజానాథ్ - వైకాపా ప్రభుత్వంపై శైలజానాథ్ కామెంట్స్
మాయ మాటలతో ఎంతో కాలం ప్రజలను మోసం చేయలేరని వైకాపా ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ వ్యాఖ్యానించారు. అధికారంలోకి రాకముందు ఉచిత విద్యుత్ అని చెప్పి మోటార్లకు మీటర్లు బిగిస్తామని వైకాపా ప్రభుత్వం మాటమార్చిందని మండిపడ్డారు.
మాయ మాటలతో ఎంతో కాలం మోసం చేయలేరు