ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పీపీఏలపై విచారణ రెండురోజులకు వాయిదా - విద్యుత్ కంపెనీలు

విద్యుత్ కొనుగోలును ప్రభుత్వం నిలిపివేయడంపై పవన, సౌర విద్యుత్ కంపెనీలు హైకోర్టును ఆశ్రయించాయి. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం విచారణను రెండురోజులకు వాయిదా వేసింది.

విద్యుత్ కొనుగోలు నిలిపివేత కేసు విచారణ... 2రోజులు వాయిదా

By

Published : Jul 30, 2019, 9:27 PM IST

పవన, సౌర విద్యుత్ కంపెనీల నుంచి విద్యుత్ కొనుగోలును ప్రభుత్వం నిలిపియాడాన్ని సవాల్ చేస్తూ విద్యుత్ కంపెనీలు హైకోర్టును ఆశ్రయించాయి. పీపీఏలకు సంబంధించిన పిటిషన్​ను కోర్టు విచారణకు స్వీకరించింది. ఇప్పటివరకు బ్యాక్ డౌన్ విధానంలో విద్యుత్​ను ప్రభుత్వం కొనుగోలు చేసినట్లు కంపెనీ తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం విచారణను రెండురోజులకు వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details