దిల్లీ సరిహద్దుల వద్ద రైతులు చేస్తున్న ఆందోళనకు సంఘీభావంగా విజయవాడ ఎస్ఆర్ఆర్ సీవీఆర్ కళాశాలలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మానవహారం ఏర్పాటు చేశారు. కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఆందోళన నిర్వహించారు. రైతులు చేస్తున్న న్యాయ పోరాటానికి మద్దతుగా దేశవ్యాప్తంగా ఉద్యమం జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం మొద్దు నిద్ర పోవడం దారుణమని ఎస్ఎఫ్ఐ ఎస్ఆర్ఆర్ కళాశాల కమిటీ కార్యదర్శి ఏసుబాబు అన్నారు. విద్యార్థుల అందోళన కార్యక్రమం అనంతరం రైతు పోరాటంలో ప్రాణాలర్పించిన అమరవీరులకు నివాళులర్పించారు.
రైతుల ఆందోళనకు సంఘీభావంగా విజయవాడలో మానవహారం - రైతుల ఆందోళనకు సంఘీభావం
దేశవ్యాప్త రైతు ఆందోళనకు సంఘీభావంగా విజయవాడ ఎస్ఆర్ఆర్ సీవీఆర్ కళాశాలలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మానవహారం ఏర్పాటు చేశారు. కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ ఎస్ఆర్ఆర్ కళాశాల కమిటీ కార్యదర్శి ఏసుబాబు డిమాండ్ చేశారు.
రైతుల ఆందోళనకు సంఘీభావంగా విజయవాడ ఎస్ఆర్ఆర్ సీవీఆర్ కళాశాలలో మనావహారం