రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భూ పరిపాలనా శాఖ చీఫ్ కమిషనర్ కార్యాలయ కార్యదర్శిగా బాబు.ఏను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. డెయిరీ డెవలప్మెంట్ ఎండీగా ఆయనకే పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలిచ్చారు.
సీసీఎల్ఏ కార్యదర్శిగా పనిచేస్తున్న బీహెచ్ఎన్ చక్రవర్తిని సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. నెల్లూరు జిల్లా గ్రామవార్డు సచివాలయాల జేసీ జి.గణేశ్ కుమార్‌ను సీసీఎల్ఏలో జాయింట్ సెక్రటరీగా బదిలీ చేశారు. ఏలూరు ఆర్డీవో పి.రచనను సీసీఎల్ఏలోని సీఎంఆర్వో ప్రాజెక్టు డైరెక్టర్‌గా బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. ఎన్. తేజ్ భరత్‌ను సీసీఎల్ఏ కార్యాలయంలో విజిలెన్సు జాయింట్ సెక్రటరీగా నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.