ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Student suicide attempt: తండ్రి హాస్టల్​కి వచ్చి.. వెంట తీసుకెళ్లలేదని.. - తెలంగాణ వార్తలు

తండ్రి హాస్టల్​కి వచ్చి.. తనను ఇంటికి తీసుకెళ్లలేదని ఓ విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించింది(Student suicide attempt). ఈ ఘటన తెలంగాణలోని తిర్యాని గురుకుల పాఠశాలలో చోటు చేసుకుంది.

suicide-attempt-
suicide-attempt-

By

Published : Nov 22, 2021, 6:36 PM IST

హాస్టల్​కి వచ్చిన తండ్రి.. తనను ఇంటికి తీసుకెళ్లలేదనే మనస్తాపంతో.. ఓ విద్యార్థిని ఆత్మహత్యకు (gurukula student suicide attempt) యత్నించింది. ఈ ఘటన తెలంగాణలోని కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో జరిగింది. తిర్యాని గురుకుల పాఠశాల(tiryani gurukula school)లో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థినిని చూసేందుకు.. ఆదివారం ఆమె తండ్రి హాస్టల్​కు వెళ్లారు. అయితే.. తనను ఇంటికి తీసుకెళ్లాలని విద్యార్థిని తండ్రిని కోరింది. కానీ.. సెలవులు లేవంటూ తండ్రి నిరాకరించారు.

దీంతో.. తీవ్ర మనస్తాపానికి గురైన విద్యార్థిని.. పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించింది. తోటి విద్యార్థులు గమనించి ఉపాధ్యాయులకు తెలియజేయడంతో.. ఆస్పత్రికి తరలించారు. కాగా.. పాఠశాలలోకి పురుగుల మందు ఎలా వెళ్లింది? ఎవరు తీసుకెళ్లారు? అన్నది అర్థంకాకుండా ఉంది.

ఇంత నిర్లక్ష్యమా?
గురుకుల పాఠశాలలోని ఉపాధ్యాయులు, వార్డెన్ నిర్లక్ష్యానికి ఈ ఘటన నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోందని విద్యార్థి నేతలు అంటున్నారు. గురుకుల పాఠశాలలోకి విద్యార్థిని పురుగుల మందు ఎలా తీసుకెళ్లిందని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా గురుకుల పాఠశాల అధికారులు మేలుకొని.. ఇక ముందు ఇలాంటివి జరగకుండా చూడాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి:high security at Kondapalli municipality: కొండపల్లి పురపాలక కార్యాలయం వద్ద భారీ బందోబస్తు.. ర్యాలీగా బయలుదేరిన తెదేపా సభ్యులు

ABOUT THE AUTHOR

...view details