రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 7 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 24కి చేరుకుంది. ఒమిక్రాన్ సోకిన వారిలో ఒమన్ నుంచి వచ్చిన ఇద్దరు మహిళలు, దుబాయ్ నుంచి ఇద్దరు, అమెరికా, సుడాన్, గోవా నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు స్పష్టం చేశారు.
ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు..
ap corona cases: మరో వైపు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 28,311 మందికి కరోనా పరీక్షలు చేయగా.. 334 మందికి వైరస్ నిర్ధరణ అయింది. కరోనా బారిన పడి ఒకరు మృతి చెందారు. కరోనా నుంచి మరో 95 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,516 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
దేశంలో భారీగా కరోనా కేసులు..