ఉపాధ్యాయ బదిలీల్లో ముఖ్యమంత్రి జోక్యాన్ని కోరుతూ ఏడుగురు ఎమ్మెల్సీలు విజయవాడ ధర్నాచౌక్ వద్ద నిరాహారదీక్ష నిర్వహించారు. ఇవి ఎప్పటికి పూర్తవుతాయో ఎవరికీ అంతుపట్టని స్థితి నెలకొందని... విద్యాశాఖ యంత్రాంగం ఉపాధ్యాయ లోకాన్ని ఒక శత్రువుగా చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. బదిలీ ఒక హక్కుగా కాకుండా ప్రజాప్రతినిధులు వారికి కావాల్సిన వారిని ఎక్కడి నుంచి ఎక్కడికైనా బదిలీ చేసుకోవాలనే ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కౌన్సెలింగ్‌కు వ్యతిరేకంగా అధికారులు ఫోన్లు చేసి మరీ ఉపాధ్యాయులను బెదిరిస్తున్నారని ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఆరోపించారు. ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడేందుకు విద్యాశాఖ మంత్రి, ఆ శాఖ అధికారులు ముందుకు రావడం లేదని... దీనివల్ల ఈ ఏడాది బదిలీలు అగమ్య గోచరంగా మారాయన్నారు. దీనికితోడు దాదాపు 20 వేల ఉపాధ్యాయ ఖాళీలు మొత్తం విద్యా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయని... ఈ దశలో సీఎం ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవాలన్నారు. ఎమ్మెల్సీలతో ఒక సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ నిరహారదీక్షలో ఎమ్మెల్సీలు విఠపు బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.లక్ష్మణరావు, కత్తి నరసింహారెడ్డి, పాకలపాటి రఘువర్మ, తదితరులు పాల్గొన్నారు.
వివిధ జిల్లాల్లో ఉపాధ్యాయ సమ్మె:
ప్రకాశం జిల్లా: