ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

SEVABHARATI TRUST : గిరిపుత్రుల ఆశాజ్యోతి.. సేవాభారతి - seva Bharati trust giving helping hands

లోకజ్ఞానం తెలియని మనుషులు... రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు... బతుకే భారమైన వారికి చదువు విలువ అసలు తెలియదు. అలాంటి వారి అభ్యున్నతే లక్ష్యంగా సేవా భారతి సంస్థ ముందుకు కదిలింది. రోజు కూలీ పనులకు, పశువులు కాసేందుకు వెళ్తున్న పిల్లలను బడిబాట పట్టించి ప్రయోజకులను చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు సాధించేలా అండగా నిలిచింది. తాము ఎదుర్కొన్న ఇబ్బందులు భావితరాలకు రాకూడదంటూ మార్పునకు శ్రీకారం చుట్టేలా గిరిజన, ఆదివాసీ యువతలో స్ఫూర్తి నింపింది.

గిరిపుత్రుల ఆశాజ్యోతి.. సేవాభారతి
గిరిపుత్రుల ఆశాజ్యోతి.. సేవాభారతి

By

Published : Dec 31, 2021, 6:38 PM IST

గిరిపుత్రుల ఆశాజ్యోతి.. సేవాభారతి

సేవా భారతి సంస్థ 12 ఏళ్ల క్రితం సేవా ప్రస్థానాన్ని ప్రారంభించింది. ఆంధ్ర, తెలంగాణలోని అత్యంత వెనుకబడిన గిరిజన, ఆదివాసీ ప్రాంతాలున్న తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, ఖమ్మం జిల్లాలను ఇందుకోసం ఎంచుకుంది. గిరిజన, ఆదివాసీ పిల్లలను అతి కష్టంమీద బడికి అలవాటు చేసేందుకు ప్రయత్నించింది. చదువుల గురించి కనీసం పరిజ్ఞానం లేని తల్లిదండ్రులు మొదట్లో అంగీకరించలేదు. కానీ ఆ తర్వాత వారిలో మార్పు మొదలైంది. పిల్లలు చదువుకుంటామంటే సరేనన్నారు. చదువుకోవడమే కాదు ఇప్పుడు ఏకంగా పాతికమందికి పైగా ప్రభుత్వ ఉద్యోగాలు, పదుల సంఖ్యలో ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నారు. సేవా భారతి సంస్థ ఇటీవల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించింది. సంస్థ అందించిన ప్రోత్సాహంతో పైకి ఎదిగిన, ఎదుగుతున్న వారందరూ తమ అంతరంగాన్ని ఈ కార్యక్రమంలో ఆవిష్కరించారు.

అన్ని రంగాల్లోనూ ...

సేవా భారతి సంస్థ అందించిన ప్రోత్సాహంతో చాలామంది వైద్యులు, నర్సులు, ఇంజినీర్లు, బ్యాంక్ మేనేజర్లు, సైనికులు, ఎమ్​ఎన్​సీ కంపెనీల్లో ఉద్యోగులుగా రాణిస్తున్నారు. తమ జీవితాల్లో ఈ వెలుగులకు సేవాభారతే కారణమని చెబుతున్నారు. ఒకప్పుడు పశువులు కాసేందుకు వెళ్లిన అమ్మాయి... నర్సుగా రాణిస్తోందంటే తల్లిదండ్రులు ఎంతో గర్విస్తున్నారు. తమ ప్రాంతంలో ఇప్పటికీ కనీస వసతులు లేవంటున్న ఆదివాసీ యువత.. తాము అక్కడి నుంచి బయటపడి అన్నిరంగాల్లో రాణిస్తున్నామని వెల్లడించారు.

మరొకరికి ఊతమిచ్చేలా...

మెుదట గిరిజన ప్రాంతాలకు వెళ్లినప్పుడు తమకు కనీస మద్దతు లేదని ఆరోగ్య భారతి అఖిల భారత కార్యదర్శి డాక్టర్ మురళీకృష్ణ అన్నారు. ఉద్యోగాలు చేస్తున్న గిరిజన యువతలో కొందరు తల్లిదండ్రులు కోల్పోయిన వారున్నారు. మరికొందరు అనాథలున్నారు. వీరందరినీ అక్కున చేర్చుకొని సేవాభారతి ముందుకు నడిపించింది. ఇప్పుడు తమలాంటి వారిని గుర్తించి చేయూతనిచ్చేందుకు ఈ యువతీయువకులు సిద్ధమయ్యారు.

ఇవీచదవండి.

ABOUT THE AUTHOR

...view details