ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విజయవాడలో 40.51% మందికి కరోనా సోకింది.. పోయింది! - సిరో సర్వైలెన్స్​ సర్వే న్యూస్

విజయవాడలో 40 శాతం మందికి వైరస్ వచ్చినట్లు సిరో సర్వైలెన్స్​లో వైద్య అధికారులు గుర్తించారు. జిల్లాలో 3,709 మందికి పరీక్షలు చేయగా విజయవాడ అర్బన్​లోనే 933 మందికి యాంటీ బాడీలు వృద్ధి చెందినట్లు తేలింది. శాస్త్రీయ పద్ధతిని అనుసరించి పరీక్షలు నిర్వహించారు. దీంతో పాజిటివ్ కేసులు జిల్లాలో తగ్గుతున్నాయని అధికారులు చెబుతున్నారు.

విజయవాడలో 40.51% మందికి కరోనా సోకింది.. పోయింది!
విజయవాడలో 40.51% మందికి కరోనా సోకింది.. పోయింది!

By

Published : Aug 20, 2020, 5:15 AM IST

విజయవాడ నగరంలో 40.51 % మందికి వైరస్ సోకి, వెళ్లినట్లు 'సిరో సర్వైలెన్స్'లో తేలింది. వీరిలో ఎవరికి కరోనా వైరస్ అనుమానిత లక్షణాలు లేవు. వీరి నుంచి సేకరించిన రక్త నమూనాలు పరీక్షించగా వైరస్ సోకి, వెళ్లినట్లు తెలిసింది. కృష్ణా జిల్లా వ్యాప్తంగా 3,709 మందికి పరీక్షలు చేయగా 19.41 % మందికి వైరస్ సోకి వెళ్లింది.

కరోనా వైరస్ వ్యాప్తి , ఇన్ ఫెక్షన్ సోకిన వాళ్లు ఎంత మంది ఉన్నారన్న విషయాన్ని గుర్తించేందుకు కృష్ణా, తూర్పుగోదావరి, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో 'సిరో సర్వైలెన్స్'ను వైద్య ఆరోగ్య శాఖ ఇటీవల నిర్వహించింది. ఐసీఎంఆర్ మార్గదర్శకాలు అనుసరించి ఈ పరీక్షలు చేశారు. కృష్ణా జిల్లా ఫలితాలను విశ్లేషించినప్పుడు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. విజయవాడ అర్బన్​లో 933 మందిలో కరోనా ప్రతి రక్షకాలు ఉన్నట్లు తేలింది. భవంతులు, గుడిసెలు , చిన్న ఇళ్లు, అపార్టుమెంట్లు, వైరస్ ఎక్కువగా నమోదైన ప్రాంతాల్లో ఎంపిక చేసిన వారి నుంచి రక్త నమూనాలు సేకరించారు. నగరంలో వైరస్ తీవ్ర ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యంగా, కృష్ణలంకలో 39 మంది నమూనాలు పరీక్షించగా 16 మందిలో వైరస్ సోకి వెళ్లినట్లు వెల్లడైంది. ఇదేవిధంగా రాణిగారితోటలో 40 మందికి చేయగా 29 మందికి, లంబాడిపేట 38-18 మందికి, రామలింగేశ్వరనగర్ 48-18, దుర్గాపురం 48-17, మధురానగర్ 32-20 , గిరిపురం - 39-18, ఎన్టీఆర్ కాలనీ - 43-16, ఆర్ఆర్ పేట 40-16 , లబ్బీపేట 21-4, పటమటలో 13 మంది నమూనాలు పరీక్షించగా ఐదుగురిలో యాంటీబాడీలు వృద్ధి చెందినట్లు గుర్తించారు. రూరల్ పరిధిలోని కాసూరులో 69లో 8, గొల్లమూడిలో 150-14 , చిన్న ఓగిరాలలో 134 నమూనాలు పరీక్షిస్తే 15 , గొల్లపల్లిలో 140కు తొమ్మిది మందిలో యాంటీబాడీలు వచ్చాయని అధికారులు చెబుతున్నారు.

విజయవాడ వన్ టౌన్​లో మొదటి కేసు నమోదైన కొత్తపేట నుంచి అన్ని ప్రాంతాల్లోనూ ఈ పరీక్షలు జరిపారు. మే లో వివిధ ప్రాంతాల్లో నమోదైన కేసులు పరిగణనలోనికి తీసుకొని ఈ పరీక్షలు చేశారు. దిల్లీలో 23 % , మహారాష్ట్రలోని ఓ మురికివాడలో పరీక్షలు జరిపితే 43 % మందికి వైరస్ వచ్చినట్లు తేలింది. విజయవాడ రూరల్, అర్బన్​లో దాదాపు అన్ని ముఖ్యమైన ప్రాంతాలు కవర్ అయ్యేలా పరీక్షలు జరిపారు.

ఈ నెల 6 నుంచి 15 వ తేదీ వరకు జరిగిన 'సిరో సర్వైలెన్స్' లో అనుమానిత లక్షణాలు కనిపించలేదని చెప్పిన వారికి మాత్రమే పరీక్షలు చేశాం. దాదాపుగా వైరస్ సోకి నెలరోజులు గడిచిన వారి వివరాలు వెలుగులోకి వచ్చాయి. దీనికి శాస్త్రీయ ప్రమాణాలు అనుసరించాం. ఫలితాల వెల్లడిలో కృష్ణా జిల్లా వ్యాప్తంగా 19.42 %, విజయవాడ అర్బన్​లో 40.51 % మందికి వైరస్ సోకి, వెళ్లినట్లు తేలింది.

- ఇంతియాజ్, కృష్ణా జిల్లా కలెక్టర్

ఇదీ చదవండి:వైరస్ సోకింది.. వెళ్లి పోయింది.. కానీ ఈ విషయం వారికి తెలీదు!

ABOUT THE AUTHOR

...view details