"దగాపడ్డ ఆంధ్ర రాష్ట్రమా’ ఆడియో గీతాన్ని చంద్రబాబు ఆవిష్కరించారు. ప్రభుత్వ అరాచకాలను, వైఫల్యాలను గ్రామీణ ప్రాంత ప్రజలకు తెలియజేసేలా రూపొందించిన ఈ పాట సందేశాత్మకంగా ఉందని సినీ నిర్మాత అట్లూరి నారాయణరావును ప్రశంసించారు. ప్రజలను ఉత్తేజపరిచేలా మరిన్ని పాటలు రూపొందించాలని సూచించారు.మరోవైపు తెదేపా అధినేత చంద్రబాబు 73వ జన్మదినం సందర్భంగా ఆయన జీవిత చరిత్రపై "చంద్రన్న కథాగానం" పేరిట రూపొందిస్తున్న ప్రత్యేక గీతం ప్రోమోను... సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి విడుదల చేశారు. పూర్తిస్థాయి వీడియోను మహానాడు సమయానికి అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు.
వైకాపా ప్రభుత్వ అరాచకాలపై.. ప్రత్యేక గీతాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు - చంద్రబాబు పుట్టినరోజు వార్తలు
TDP video on YCP: వైకాపా ప్రభుత్వ అరాచకాలను, వైఫల్యాలను గ్రామీణ ప్రాంత ప్రజలకు తెలియజేసేలా "దగాపడ్డ ఆంధ్ర రాష్ట్రమా’ ఆడియో గీతాన్ని చంద్రబాబు ఆవిష్కరించారు. మరోవైపు తెలుగుదేశం అధినేత చంద్రబాబు 73వ జన్మదినం సందర్భంగా ఆయన జీవిత చరిత్రపై "చంద్రన్న కథగానం" పేరిట రూపొందిస్తున్న ప్రత్యేక గీతం ప్రోమోను సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరీ విడుదల చేశారు.
1