లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాల తరహాలో వారికి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి నుంచి సాయం అందించాలని కోరారు. వీరితో పాటు రాష్ట్రంలోని వలస కూలీల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని అన్నారు. వారిని స్వస్థలాలకు పంపించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. అలాగే మరణించిన వలస కార్మికుల కుటుంబాలకు రూ.10 లక్షలు చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై ఏఐటీయూసీ, వలస కార్మికుల ఇబ్బందులపై తాను హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశామని గుర్తు చేశారు. వాటిపై విచారణ సోమవారానికి వాయిదా పడిందని ఆయన వెల్లడించారు.
ఇదీ చదవండి
'వలస కూలీలను స్వస్థలాలకు పంపాలి'
లాక్డౌన్తో ఇబ్బందులు పడుతున్న భవన నిర్మాణ కార్మికులు, వలస కూలీలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. వారి సమస్యలపై హైకోర్టులో తాము దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ వాయిదా పడిందని వెల్లడించారు.
సీపీఐ రామకృష్ణ