ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'బ్యాంకింగ్ రంగాన్ని ఈ అంశాలు దెబ్బతీస్తున్నాయి' - ఎన్​పీఏలపై విజయవాడలో సదస్సు న్యూస్

బ్యాంకర్లు రుణాల వసూళ్ల వేటలోపడి... ఉత్పత్తి పరిశ్రమల్ని విచ్ఛిన్నం చేసే పరిస్థితి ఉండకూడదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామసుబ్రమణియన్ అభిప్రాయపడ్డారు. దేశంలోని ప్రభుత్వ బ్యాంకుల్లో రూ.9 లక్షల 18 వేల 487 కోట్ల ఎన్​పీఎలు ఉన్నట్టుగా రిజర్వుబ్యాంకు ఇటీవలే ప్రకటించిందని వెల్లడించారు.

'బ్యాంకింగ్ రంగాన్ని రెండు సమస్యలు దెబ్బతీస్తున్నాయి'

By

Published : Nov 23, 2019, 5:23 PM IST

'బ్యాంకింగ్ రంగాన్ని ఈ అంశాలు దెబ్బతీస్తున్నాయి'

బ్యాంకర్లు రుణాల వేటలోపడి ఉత్పత్తి పరిశ్రమల్ని విచ్ఛిన్నం చేసే పరిస్థితి తలెత్తకూడదని... సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామసుబ్రమణియన్‌ పేర్కొన్నారు. బ్యాంకులను రుణాలిచ్చే సంస్థలుగా కాకుండా... ఉత్పత్తిని ప్రోత్సహించే సాధనంలా వినియోగదారులు చూడాలని సూచించారు. విజయవాడలో నిర్వహించిన... 'ఎన్​పీఏ వసూళ్లలో బ్యాంకర్లు, న్యాయవాదులు, న్యాయవ్యవస్థ పాత్ర' సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పరిశ్రమలు, వ్యవసాయ ఉత్పత్తులకు బ్యాంకులు మూలాధారమని... రుణ గ్రహీతల పరిస్థితి బట్టి కొన్నిసార్లు వెసులుబాటు కల్పిస్తే... దివాళా తీసే పరిస్థితులు ఉత్పన్నం కావని పేర్కొన్నారు. బ్యాంకు నిబంధనల్లో అనేక సమస్యలు ఉన్నాయని... వాటిని మార్చాల్సిన అవసరముందని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరాం అభిప్రాయపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details