ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సర్వమతాలను గౌరవించాలి: కేశినేని శ్వేత - క్రిస్మస్​ వేడుకలు

క్రీస్తు చూపిన సేవామార్గం ప్రతి ఒక్కరూ అనుసరించి.. సర్వమతాలను అంతా గౌరవించాలని ఎంపీ కేశినేని నాని కుమార్తె శ్వేత అన్నారు. కేశినేని భవన్​లో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. క్యాండిల్స్ వెలిగించి, కేక్ కట్ చేశారు.

semi christmas  celebrations at kesineni nani bhavan
విజయవాడలో సెమీ క్రిస్మస్​ వేడుకలు

By

Published : Dec 21, 2020, 5:25 PM IST

సమస్త మానవావళికి ప్రేమతో వెలుగులు పంచిన ఏసుక్రీస్తు జన్మదిన వేడుకల సందడి.. విజయవాడలో ముందుగానే ప్రారంభమైంది. కేశినేని భవన్​లో నిర్వహించిన ఈ వేడుకల్లో విజయవాడ ఎంపీ కేశినేని నాని కుమార్తె శ్వేత పాల్గొన్నారు. పెద్ద ఎత్తున పాల్గొన్న క్రీస్తు ఆరాధాకులతో ప్రీ-క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. క్యాండిల్స్ వెలిగించి, కేక్ కట్ చేసి సంబరాలు చేశారు.

శాంతిని, ప్రేమను ప్రబోధించిన మహాత్ముడు ఏసుక్రీస్తు అని శ్వేత అన్నారు. మానవాళి ఉద్భవించినప్పటినుంచి ఎందరో మహానుభావులు పుట్టారని, కరుణ, ప్రేమనే మార్గంగా చూపిన మహాత్ముడు ఏసుప్రభువని ఆమె వ్యాఖ్యానించారు. తెదేపా విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు నెట్టెం రఘురాం పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details