విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్దనున్న సీతారామ మందిరంలో... సీతమ్మవారి విగ్రహం ధ్వంసం చేశారు. ఆటో స్టాండ్ సమీపంలోనే ఉన్న గుడిలో... విగ్రహం కిందపడి పగిలిపోయి ఉంది. ఇది ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేశారా? అన్నది తెలియడం లేదు. ఆరుబయట ఉన్న ఆలయంలో పిల్లులు తిరుగుతుంటాయి. పిల్లులు తోయడం వల్ల విగ్రహం కిందపడిందా? అనే అనుమానమూ వ్యక్తమవుతోంది. సమాచారం తెలిసి రంగంలోకి దిగిన పోలీసులు.. ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహంతోనే రాష్ట్రంలో ఆలయాలపై వరుస దాడులు జరుగుతున్నాయని తెలుగుదేశం ఆరోపించింది. హత్యా రాజకీయాలపై ప్రజల దృష్టిని మళ్లించేందుకే ప్రభుత్వం పథకం ప్రకారం ఈ ఘటనలు చేయిస్తోందని.. మాజీమంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. ఆలయం ఎదుట తెలుగుదేశం నేతలు ఆందోళనకు దిగారు. ఎలుకలు విగ్రహాన్ని పడేసి ఉంటాయన్న పోలీసుల వ్యాఖ్యలపై తెలుగుదేశం నేత పట్టాభి మండిపడ్డారు.