కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితురాలు భూమా అఖిలప్రియ బెయిల్ పిటిషన్ను సికింద్రాబాద్ న్యాయస్థానం తిరస్కరించింది. అఖిలప్రియపై పోలీసులు అదనపు సెక్షన్లు నమోదు చేసినట్లు మెమో దాఖలు చేశారు. అదనపు సెక్షన్ల నమోదుతో బెయిల్ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది.
ప్రవీణ్ రావు సోదరులను అపహరించిన కేసులో ఈ నెల 6న బోయిన్ పల్లి పోలీసులు అఖిలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. దర్యాప్తులో పురోగతి కోసం ఈ 11వ తేదీ నుంచి మూడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించారు. కస్టడీ ముగిసినందున బెయిల్ ఇవ్వాలని అఖిలప్రియ తరఫు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం బాాలేదని... పోలీసుల కస్టడీ కూడా పూర్తయినందున బెయిల్ మంంజూరు చేయాలని అఖిల ప్రియ కోరారు. పోలీసులు మాత్రం అఖిలప్రియకు బెయిల్ ఇవ్వొద్దని కౌంటర్ దాఖలు చేశారు.