వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ఇచ్చిన వివరాల ప్రకారం ఎస్‌జీఎస్ ల్యాబ్స్‌కు బేవరేజస్ కార్పొరేషన్ లేఖ రాసిందని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ్ తెలిపారు. పరీక్షించిన నమూనాల వివరాలను తెలియజేయాలని కోరినట్లు చెప్పారు. బీఐఎస్ ప్రమాణాల ప్రకారం పరీక్ష చేయాలని కోరలేదని.. శాంపిల్స్ ఎక్కడివో తెలియదని ఎస్‌జీఎస్ వెల్లడించిందని రజత్ భార్గవ్ పేర్కొన్నారు.
అనధికారిక శాంపిల్స్‌కు సంబంధించిన అంశాలను ఎస్‌జీఎస్ పూర్తిగా ధ్రువీకరించబోమని చెప్పిందన్నారు. ఇద్దరు వ్యక్తుల మద్యం నమూనాల్లో హానికరమైన పదార్థాలు లేవని ఎస్‌జీఎస్ వెల్లడించిందని ఆయన తెలిపారు. బేవరేజస్ కార్పొరేషన్‌పై దురుద్దేశాలు ఆపాదిస్తూ.. నివేదిక విడుదల చేసిన వైకాపా ఎంపీ రఘురామకృష్ణ రాజుపై క్రిమినల్ కేసు పెడుతామని రజత్ భార్గవ్ పేర్కొన్నారు. రఘురామపై పరువు నష్టం దావా వేస్తామన్నారు. ఆధారాలు లేకుండా దుష్ప్రచారం చేస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.