ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Employees Protest Rally: సచివాలయంలో ఉద్యోగులు నిరసన ర్యాలీ - వెంకట్రామిరెడ్డి

Secretariat Employees Protest: ప్రభుత్వం ఇచ్చిన రివర్స్ పీఆర్సీ వద్దంటూ.. వెనక్కి నడుస్తూ సచివాలయ ఉద్యోగులు నిరసన తెలిపారు. ప్రభుత్వం సామరస్యంగా వ్యవహరించకుండా ఉద్యోగులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందన్న పీఆర్సీ సాధన సమితి నేత వెంకట్రామిరెడ్డి.. సోమవారం నుంచి సచివాలయంలో రీలే నిరాహారదీక్షలు ప్రారంభిస్తామని హెచ్చరించారు.

సచివాలయ ఉద్యోగుల నిరసన
Employees Protest Rally

By

Published : Jan 28, 2022, 6:06 PM IST

వెనక్కి నడుస్తూ సచివాలయ ఉద్యోగుల నిరసన

Secretariat Employees Fight for PRC: పీఆర్సీపై ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా విజయవాడలోని సచివాలయంలో ఉద్యోగులు నిరసన ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వం ఇచ్చింది రివర్స్ పీఆర్సీ అంటూ.. వెనక్కు నడుస్తూ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సామరస్యంగా వ్యవహరించకుండా ఉద్యోగులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని పీఆర్సీ సాధన సమితి నేత వెంకట్రామిరెడ్డి దుయ్యబట్టారు. ప్రభుత్వం కొన్ని సంఘాలను పిలిపించి మాట్లాడినంత మాత్రాన ఉద్యమాన్ని అపగలరా అని ప్రశ్నించారు. ఉద్యోగులు స్వచ్ఛందంగా ఉద్యమంలో పాల్గొంటున్నారని వెంకట్రామిరెడ్డి అన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

చర్చలకు రావడంలేదంటూ తమపై ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. రెండు రోజుల ముందే తమ డిమాండ్లను రాతపూర్వకంగా ప్రభుత్వానికి ఇచ్చామని ఆయన స్పష్టంచేశారు. ఉద్యోగులకు నష్టం చేకూర్చే జీవోలను రద్దు చేయకపోగా వాటిని అమలు చేయడానికి సిద్ధపడుతూ.. తమ మీద ఇలాంటి ప్రచారం చేయడం సరైంది కాదన్నారు. ప్రభుత్వ విధానాలకు నిరసనగా సోమవారం నుంచి సచివాలయంలో ఉద్యోగుల రీలే నిరాహారదీక్షలు ప్రారంభిస్తామని హెచ్చరించారు.

పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకుంటే ప్రభుత్వంతో చర్చలు కొనసాగించేందుకు సిద్ధమేనని వెంకట్రామిరెడ్డి పునరుద్ఘాటించారు. ఒకవేళ ట్రెజరీ ఉద్యోగులపై చర్యలు తీసుకుంటే ఆ క్షణం నుండే సమ్మెలోకి వెళ్తామని ఆయన హెచ్చరించారు.

ఇదీ చదవండి..:Employees Association: ' మాా డిమాండ్లకు అంగీకరిస్తేనే ప్రభుత్వంతో చర్చలు'

ABOUT THE AUTHOR

...view details