ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

HRA: సచివాలయ ఉద్యోగుల హెచ్‌ఆర్‌ఏ మరో ఏడాది పొడిగింపు - సచివాలయ ఉద్యోగుల హెచ్‌ఆర్‌ఏ మరో ఏడాది పొడిగింపు తాజా వార్తలు

హైదరాబాద్ నుంచి వచ్చిన సచివాలయ ఉద్యోగులకు మరో ఏడాదిపాటు 30 శాతం హెచ్ఆర్ఏను పొడగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తవారు, డెప్యుటేషన్‌పై వచ్చినవారికీ అద్దె భత్యం ఉత్తర్వులు వర్తించవని ఉత్తర్వుల్లో పేర్కొంది.

Secretariat Employees HRA extension another year
సచివాలయ ఉద్యోగుల హెచ్‌ఆర్‌ఏ మరో ఏడాది పొడిగింపు

By

Published : Jul 31, 2021, 8:13 PM IST

హైదరాబాద్ నుంచి రాజధాని అమరావతి ప్రాంతానికి తరలి వచ్చిన సచివాలయ, విభాగాధిపతుల కార్యాలయాల ఉద్యోగులకు 30 శాతం హెచ్ఆర్ఏను మరో ఏడాది పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2021 జూలై 1 నుంచి ఏడాది పాటు హెచ్ఆర్ఏ పొడిగింపు ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. హైదరాబాద్ నుంచి తరలివచ్చి విజయవాడ, గుంటూరులలో అద్దె ప్రాతిపదికన నివాసం ఉంటున్న ఉద్యోగులకు 30 శాతం హెచ్ఆర్ఏ వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కోంది. హైదరాబాద్ నుంచి తరలిరాని ఉద్యోగులకు, నూతనంగా ఉద్యోగాల్లోకి చేరిన వారికి, డెప్యుటేషన్​పై వచ్చిన వారికి ఇంటి అద్దె భత్యం ఉత్తర్వులు వర్తించవని వెల్లడించింది.

ప్రభుత్వ పెన్షనర్లకు డీఏ పెంపు

రాష్ట్రంలోని ప్రభుత్వ పెన్షర్లకు 3.144 శాత మేర డీఏ పెంచుతూ ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. పెంచిన కరవు భత్యాన్ని 2019 జనవరి 1 నుంచి వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకుంది. కొత్త పెంపుతో 33.536 శాతానికి పెరిగిన పెన్షనర్ల కరవు భత్యం చెల్లించనున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి రావత్ ఉత్తర్వులు ఇచ్చారు. 2021 జూలై నుంచి పెంపుదల చేసిన డీఏతో కలిపి పింఛన్ చెల్లించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. బకాయి ఉన్న డీఏను వాయిదాల్లో చెల్లించనున్నట్లు తెలియజేసింది.

2019 జూలై నుంచి పెంచాల్సిన మూడో డీఆర్ 5.24 శాతాన్ని 2022 జనవరి నెల నుంచి చెల్లించనున్నట్లు ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. రెండో డీఏ 3.144 శాతం 2019 జనవరిలో సవరిస్తూ గతంలో ఆర్థికశాఖ ఉత్తర్వులిచ్చింది. 2019 జూలై నుంచి 5.24 శాతం మేర మూడో డీఆర్ పెంపుదల చేసినట్లు ఆర్ధిక శాఖ స్పష్టం చేసింది. ఈ పెంపుతో 38.776 శాతానికి పెన్షనర్ల కరవు భత్యం పెరిగింది. వివిధ ప్రభుత్వ విభాగాల్లో పనిచేసిన పెన్షనర్లకు సవరించిన కరవు భత్యం రేట్లను సవరిస్తూ ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు.

ఇదీ చదవండి

Cabinet: ఆగస్టు 6న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details