రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల ప్రక్రియ రేపట్నుంచి ప్రారంభం కానుంది. మంగళవారం ఉదయం 10.30 గంటల నుంచి రెండోదఫా ఎన్నికలకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఫిబ్రవరి 4వ తేదీ సాయంత్రం 5 గంటలకు నామినేషన్ల దాఖలుకు తుది గడువు విధించారు. ఫిబ్రవరి 5న నామినేషన్ల పరిశీలన..6న నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాలను రెవెన్యూ డివిజన్లలోని అధికారులు పరిశీలిస్తారు. ఫిబ్రవరి 7న అభ్యంతరాలపై తుది నిర్ణయం...8న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు విధించారు.
ఫిబ్రవరి 13న ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు రెండోదఫా పోలింగ్ నిర్వహిస్తారు. ఫిబ్రవరి 13న సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు. అదే రోజు ఫలితాల వెల్లడించి.. ఉప సర్పంచి ఎన్నిక పూర్తి చేస్తారు.