ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గవర్నర్​ బిశ్వభూషణ్​తో ఎస్ఈసీ భేటీ - గవర్నర్ బిశ్వభూషణ్‌ పంచాయతీ ఎన్నికలపై చర్చించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ

పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్.. గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో భేటీ అయ్యారు. ఎన్నికలు సమర్థంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సహకరించాలని ఆదేశించాల్సిందిగా... ఎస్‌ఈసీ కోరినట్లు సమాచారం.

sec discus with governor biswabhusan
గవర్నర్​ బిశ్వభూషణ్​తో ఎస్ఈసీ భేటీ

By

Published : Feb 8, 2021, 8:09 PM IST

పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఉన్నతాధికారులపై చర్యల గురించి... రాజ్‌భవన్‌లో గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ చర్చించారు. సుమారు 20 నిమిషాల పాటు ఈ భేటీ జరిగింది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి , మంత్రులపై చర్యలు తీసుకోవాలన్న లేఖపై చర్చించినట్లు సమాచారం.

ఎన్నికలు సమర్థంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సహకరించాలని ఆదేశించాల్సింగా ఎస్‌ఈసీ కోరినట్లు తెలిసింది. మరోవైపు గవర్నర్‌ను సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, ఏజీ శ్రీరామ్‌ కలిశారు. ఎన్నికల విధుల నుంచి తప్పించిన నిర్ణయంపై ప్రవీణ్ ప్రకాష్ చర్చించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details