ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెదేపా పంచాయతీ మేనిఫెస్టో రద్దు చేసిన ఎస్​ఈసీ నిమ్మగడ్డ

పంచాయతీ ఎన్నికల కోసం పల్లె ప్రగతికి - పంచ సూత్రాలు పేరిట తెదేపా అధినేత చంద్రబాబు విడుదల చేసిన మేనిఫెస్టోని రాష్ట్ర ఎన్నికల సంఘం రద్దు చేసింది. మేనిఫెస్టో విడుదలపై వైకాపా చేసిన ఫిర్యాదును పరిశీలించిన ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్, తెదేపా నుంచి వివరణ తీసుకున్న అనంతరం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

తెదేపా పంచాయతీ మేనిఫెస్టో రద్దు చేసిన ఎస్​ఈసీ నిమ్మగడ్డ
తెదేపా పంచాయతీ మేనిఫెస్టో రద్దు చేసిన ఎస్​ఈసీ నిమ్మగడ్డ

By

Published : Feb 4, 2021, 10:22 PM IST

పంచాయతీ ఎన్నికల మేనిఫెస్టో విడుదలపై తనకు తెదేపా ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆదేశాల్లో తెలిపారు. పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతాయని.. ఈ ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేయడం ఎన్నికల నియమావళికి విరుద్ధమని ఎన్నికల సంఘం తెలిపింది. ఎన్నికల ప్రచారంలో ఎక్కడా మేనిఫెస్టోలను వినియోగించరాదని ఎన్నికల కమిషన్ ఆదేశాల్లో తెలిపింది. పోటీ చేసే అభ్యర్థులు ఎక్కడా రాజకీయ నాయకులు, లేదా జాతీయ నాయకుల పేర్లు లేదా ఛాయాచిత్రాలను వాడరాదని స్పష్టం చేసింది. వారి ఫొటోలు ఉన్న హ్యాండ్ బుక్​లు, ఫ్లెక్సీలు, కరపత్రాలు, బ్యానర్లు, జెండాలు మొదలైన ప్రచార సామగ్రిని ఉపయోగించడానికి అనుమతించేది లేదని కమిషన్ స్పష్టం చేసింది. ఏ రాజకీయ పార్టీకి లేదా స్థానిక కార్యకర్తలకు అనుబంధమైన ఎటువంటి ప్రచార సామగ్రిని ముద్రించకూడదని ఆదేశాల్లో పేర్కొంది. అభ్యర్థులు ఏ రాజకీయ పార్టీ మద్దతును సూచించే టోపీలు, కండువాలు, కర్చీఫ్‌లు, వీడియోలు ఇతరత్రా వస్తువులను పంపిణీ చేయకూడదని ఎన్నికల సంఘం తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details