ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

19న పరిషత్ ఎన్నికల లెక్కింపునకు తీసుకోవాల్సిన చర్యలపై ఎస్​ఈసీ సమీక్ష

ఈ నెల 19న పరిషత్ ఎన్నికల లెక్కింపు నేపథ్యంలో కలెక్టర్లు, జెడ్పీ సీఈవోలతో ఎస్‌ఈసీ నీలం సాహ్ని వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు.

sEC Neelam Sahni
ఎస్‌ఈసీ నీలం సాహ్ని

By

Published : Sep 17, 2021, 9:41 AM IST

Updated : Sep 17, 2021, 1:08 PM IST

పరిషత్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం(ఈనెల 19న) చేపట్టాలని నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ఎన్నికల కమిషన్‌.. అందుక సంబంధించిన ఏర్పాట్లపై సమీక్ష చేపట్టింది. ఎన్నికల లెక్కింపునకు తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్లు, జెడ్పీ సీఈవోలతో ఎస్‌ఈసీ(SEC) నీలం సాహ్ని వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. లెక్కింపు కేంద్రాలు, సిబ్బంది నియామకం వంటి అంశాలపై ప్రధానంగా సమీక్షించారు. కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని కలెక్టర్లు, ఎస్పీలను సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ ఆదేశించారు.

లెక్కింపు సిబ్బంది, ఏజెంట్లు తప్పనిసరిగా వ్యాక్సిన్‌ వేయించుకుని ఉండాలన్నారు. లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేయాలని.. ఏర్పాట్ల పర్యవేక్షణకు జిల్లా అధికారి ఒకరిని ఇన్‌ఛార్జిగా పెట్టాలని స్పష్టం చేశారు.

Last Updated : Sep 17, 2021, 1:08 PM IST

For All Latest Updates

TAGGED:

sec taza

ABOUT THE AUTHOR

...view details