ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'పంచాయతీ ఎన్నికల నిర్వహణలో ఎస్​ఈసీ విఫలం'

రాష్ట్ర ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధంగా పనిచేస్తే.. మాచర్ల, పుంగనూరులో నూరుశాతం ఏకగ్రీవాలు జరిగేవి కావని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు విమర్శించారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణలో ఎస్​ఈసీ విఫలమైందని ఆక్షేపించారు.

By

Published : Feb 13, 2021, 7:32 PM IST

Published : Feb 13, 2021, 7:32 PM IST

పంచాయతీ ఎన్నికల నిర్వహణలో ఎస్​ఈసీ విఫలం
పంచాయతీ ఎన్నికల నిర్వహణలో ఎస్​ఈసీ విఫలం

పంచాయతీ ఎన్నికల నిర్వహణలో ఎస్​ఈసీ విఫలమైందని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు విమర్శించారు. పలుచోట్ల తెదేపా బలపరిచిన అభ్యర్థులు గెలిచినా..వైకాపా మద్దతుదారులు గెలిచినట్లు రిటర్నింగ్ అధికారులు ప్రకటిస్తున్నారని ఆరోపించారు. అయినా అవేవీ పట్టించుకోకుండా ఎస్​ఈసీ చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. అధికారులు, పోలీసుల సాయంతోనే ప్రభుత్వం బలవంతపు ఏకగ్రీవాలకు పాల్పడుతోందని ఆక్షేపించారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధంగా పనిచేస్తే..మాచర్ల, పుంగనూరులో నూరుశాతం ఏకగ్రీవాలు జరిగేవి కావన్నారు. ఎస్ఈసీ సీరియస్​గా వ్యవహరించలేదు కాబట్టే అధికారులు వైకాపా ప్రభుత్వం చెప్పినట్లు నడుచుకుంటున్నారని ఆరోపించారు. మూడు, నాలుగో విడతల్లో జరిగే పంచాయతీ ఎన్నికలైనా..ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా ఎస్ఈసీ చర్యలు తీసుకోవాలని హితవు పలికారు.

ABOUT THE AUTHOR

...view details