కార్పోరేషన్లు, మున్సిపాల్టీలు, నగరపంచాయతీల్లో జరిగిన ఏకగ్రీవాలను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం 2,794 వార్డులకు గాను 578 వార్డులు ఏకగ్రీవమైనట్లు ఎస్ఈసీ తెలిపింది. డివిజన్లు , వార్డులు కలిపి మొత్తం 20.68 శాతం ఏకగ్రీవమయ్యాయని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వెల్లడించారు. ఏకగ్రీవాలతో అధికార వైకాపా అత్యధిక స్థానాలు దక్కించుకుందని కమిషన్ తెలిపింది.
రాష్ట్రంలో 2,794 వార్డులకు గాను.. 578 వార్డులు ఏకగ్రీవం
కార్పోరేషన్లు, మున్సిపాల్టీలు, నగరపంచాయతీల్లో జరిగిన ఏకగ్రీవాలను రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం 2,794 వార్డులకు గాను 578 వార్డులు ఏకగ్రీవమయ్యాయని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తెలిపారు.
ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్
వైకాపాకి 570 స్థానాలు , తెదేపాకి - 5, భాజపాకి- 1,స్వతంత్ర అభ్యర్థులకు -2 స్థానాల్లో ఏకగ్రీవమైనట్లు ఎస్ఈసీ స్పష్టం చేసింది. ఆయా పార్టీల అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది.
ఇదీ చూడండి.'ఫిర్యాదులను ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణిస్తోంది'