పశ్చిమగోదావరి,ప్రకాశం జిల్లాల్లోని పలు మండలాల్లో పంచాయతీ ఎన్నికల తేదీలను మారుస్తూ.. రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. కలెక్టర్ల వినతి మేరకు తేదీల్లో మార్పులు చేశారు. ఒంగోలులో 20కి గాను 15 మండలాలకు తొలి దశలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఒంగోలు డివిజన్లో మిగిలిన 5 మండలాలైన జె.పంగులూరు, కొరిశపాడు, అద్దంకి, సంతమాగులూరు, బల్లికురవలో ఫిబ్రవరి 13న రెండో దశలో ఎన్నికలు జరగన్నాయి.
పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం మండలంలో 3వ దశకు బదులు ఫిబ్రవరి 13న రెండోదశలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఏలూరు పరిధిలోని 4 మండలాలకు ఎన్నికల తేదీల్లో మార్పులు జరిగాయి. చింతలపూడి, కామవరపుకోట, లింగపాలెం, జె.నర్సాపురం మండలాల్లో 4వ దశకు బదులు ఫిబ్రవరి 17న 3వ దశలోనే ఎన్నికలు జరగనున్నాయి.