ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎన్నికల్లో స్వచ్ఛతే ఎస్​ఈసీ లక్ష్యం: నిమ్మగడ్డ - నామినేషన్లపై దాఖలైన పిటీషన్ల

ఎన్నికలను నిష్పాక్షికంగా, స్వచ్ఛంగా నిర్వహించేందుకు పరిస్థితుల ఆధారంగా తగిన నిర్ణయాలు తీసుకునే అధికారం తమకు ఉంటుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ స్పష్టంచేశారు. ఎన్నికల రద్దు, వాయిదా, తిరిగి నిర్వహించే అధికారం కమిషన్ కు ఉందంటూ హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్లపై దాఖలైన పిటిషన్లలో ఎస్ఈసీ ఈ మేరకు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది.

hc on mptc and zptc re lections
ఎన్నికల్లో స్వచ్ఛతే ఎస్​ఈసీ లక్ష్యం

By

Published : Mar 8, 2021, 3:49 AM IST

ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు చోటు చేసుకుంటే జోక్యం చేసుకునే అధికారం ఎస్ఈసీకి ఉందని నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యం, వ్యవస్థల మనుగడకు స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక ఎన్నికలు ప్రాథమిక అవసరం అన్నారు . సజావుగా ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘానికి విస్తృతాధికారాలున్నాయని పేర్కొంటూ ఆయన హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. అధికరణ 324 ప్రకారం .. ఎన్నికల విషయంలో అధికారానికి ఎన్నికల సంఘం ఏకైక కేంద్రబిందువు అన్నారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో స్పష్టం చేసిందని... కేంద్ర ఎన్నికల సంఘానికి ఉన్న అధికారాలే ఎస్‌ఈసీకి ఉంటాయని గుర్తుచేశారు.

ఎన్నికలను సక్రమంగా నిర్వహించాల్సిన బాధ్యత కేవలం ఎన్నికల సంఘంపైనే కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, అధికారులపై ఉందన్నారు. రిటర్నింగ్ అధికారులు ప్రచురించిన తుది జాబితా ప్రకారం జడ్పీటీసీలకు 126 మంది అభ్యర్థులు , ఎంపీటీసీలకు 2363 అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారన్నారు. ఎన్నడూ లేని విధంగా అసాధారణంగా ఏకగ్రీవాల సంఖ్య పెరిగిన విషయం కమిషన్ దృష్టికి వచ్చిందని ఆయన అఫిడవిట్‌లో తెలిపారు.

జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల దాఖలుకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా బెదిరింపులు , నామినేషన్ల తర్వాత బలవంతపు ఉపసహరణలు జరిగినట్లు వివిధ రాజకీయ పార్టీలు , వ్యక్తుల నుంచి భారీగా ఫిర్యాదులు అందాయన్న ఎస్‌ఈసీ....వాటిని పరిశీలించి , ఏకగ్రీవాల న్యాయబద్ధ ప్రామాణికతను నిర్ణయించేందుకు విచారణకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు . వివిధ సందర్భాల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకొని పిటిషనర్ వేసిన వ్యాజ్యాన్ని కొట్టేయాలని కోరారు . జడ్పీటిసీ , ఎంపీటీసీ నామినేషన్ల దాఖలుకు అవరోధాలు , బలవంతపు ఉపసంహరణ విషయంలో అందిన ఫిర్యాదులపై విచారణలను నిలువరిస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి 19 న ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరారు.

బెదిరింపులు, దౌర్జన్యాల కారణంగా గతేడాది ఎంపీటీసీ , జడ్పీటీసీ స్థానాలకు నామినేషన్ వేయలేని వారు, వేధింపుల కారణంగా నామినేషన్ ఉపసంహరించుకున్న వారు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా విచారణ జరిపి నివేదికలు ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశిస్తూ ఫిబ్రవరి 18 న ఎస్ఈసీ ఉత్తర్వులిచ్చిందని అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ చిత్తూరు జిల్లా పీలేరుకు చెందిన రత్నశేఖర్ రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంలో ఎంపీటీసీ , జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు నిర్ధారిస్తూ ఎన్నికల అధికారి ప్రకటన చేసిన చోట విచారణ జరపవద్దని...ఫామ్ -10 ఇవ్వని చోట ఏదైనా చర్యలు తీసుకొని ఉంటే వాటిని ప్రకటించొద్దని పేర్కొంటూ హైకోర్టు ఫిబ్రవరి 19 న మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఈ వ్యాజ్యంలో ఎన్నికల కమిషనర్ తాజాగా కౌంటర్ దాఖలు చేశారు. మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరారు.

ఇదీ చదవండి:

ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేశ్​ను బర్తరఫ్ చేయాలి: అయ్యన్నపాత్రుడు

ABOUT THE AUTHOR

...view details