నకిలీ మద్యం తయారీపై ప్రత్యేక నిఘా ఉందని ఎస్ఈబీ అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటివరకు అక్రమ మద్యం రవాణా, విక్రయాలకు సంబంధించి 38 వేల కేసులు నమోదు చేసి 48 వేల మందిని అరెస్ట్ చేశామన్నారు. అక్రమ రవాణాకు సహకరించిన 150 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులను అరెస్ట్ చేశామని చెబుతున్న ఎస్ఈబీ కమిషనర్ వినీత్ బ్రిజ్ లాల్తో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి.
నకిలీ మద్యం తయారీపై ప్రత్యేక నిఘా: వినీత్ బ్రిజ్లాల్
ఇతర రాష్ట్రాల నుంచి 3 మద్యం సీసాలు ఒక వ్యక్తి తీసుకురావచ్చనే హైకోర్టు తీర్పును అమలుచేస్తామని ఎస్ఈబీ ఉన్నతాధికారులు చెప్పారు. మద్యం అక్రమ రవాణా అరికట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 389 చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నామని వెల్లడించారు.
నకిలీ మద్యం తయారీపై ప్రత్యేక నిఘా: వినీత్ బ్రిజ్లాల్