ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రవ్యాప్తంగా నాటు సారా స్థావరాలపై ఎస్‌ఈబీ దాడులు - నాటు సారా స్థావరాలపై ఎస్‌ఈబీ దాడులు వార్తలు

రాష్ట్రవ్యాప్తంగా నాటు సారా స్థావరాలపై ఎస్‌ఈబీ దాడులు కొనసాగిస్తోంది. ఆపరేషన్ పరివర్తన్ 2.0లో భాగంగా.. నాటుసారా తయారీకి అవకాశం ఉన్న అన్నీ ప్రాంతాల్లో.. ఎస్​ఈబీ అధికారులు, స్థానిక పోలీసులు, ఎన్​పీఎస్​పీ బృందాలు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా నాటు సారా స్థావరాలపై ఎస్‌ఈబీ దాడులు
రాష్ట్రవ్యాప్తంగా నాటు సారా స్థావరాలపై ఎస్‌ఈబీ దాడులు

By

Published : Mar 28, 2022, 5:04 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా "ఆపరేషన్ పరివర్తన్ 2.0"లో భాగంగా.. నాటు సారా స్థావరాలపై స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ ఉక్కుపాదం మోపుతోంది. నాటుసారా తయారీకి అవకాశం ఉన్న అన్ని ప్రాంతాల్లో.. ఎస్​ఈబీ అధికారులు, స్థానిక పోలీసులు, ఎన్​పీఎస్​పీ బృందాలు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3 వేల 403 కేసులు నమోదు చేయగా.. వారం రోజుల్లో నలుగురిపై పీడీ యాక్ట్ ప్రయోగించింది. 2020 అక్టోబర్ నుంచి నేటివరకు పోలీసులు, ఎక్సైజ్, రెవెన్యూ అధికారుల సమన్వయంతో ఎస్​ఈబీ నాటుసారా స్థావరాలపై నిరంతరయంగా దాడులు జరుపుతూ.. నిర్వాహకులపైన కేసులు నమోదు చేస్తోంది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 17 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details