యాదగిరివాసునికి సరికొత్త రూపాలంకరణలతో వినూత్న ఆలయం సిద్ధమైంది. ఆలయమంటే ఓ గోపురం, ఓ ధ్వజస్తంభం, ఓ గంట కట్టేసినంత సులువుగా చేసినది కాదు ఈ యాదాద్రి. దాదాపు 1500 మంది శిల్పులను తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లోని ఆళ్లగడ్డ, తెలంగాణలోని వివిధ ప్రాంతాలనుంచి సుత్తి, ఉలి, శానం చేతపట్టుకుని విచ్చేశారు. 30మందికి పైగా స్తపతులు, ప్రధాన స్తపతి ఈ వందలాది శిల్పకారులచేత అహరహం శిలలపై శిల్పాలు చెక్కించారు.
నూతన యాదాద్రి ఆలయంపై శిల్పసోయగం - telangana varthalu
శిలలపై శిల్పాలు చెక్కినారూ.. మనవాళ్లు సృష్టికే అందాలు తెచ్చినారు అనే పాటలోని అక్షరమక్షరం శిల్పమై యాదాద్రిలో కనువిందు చేస్తోంది.. నూతన రూపురేఖలతో సిద్ధమైన యాదాద్రి లక్ష్మీనరసింహ ఆలయ నిర్మాణాలపై శిల్పసోయగాల వర్ణనను వినడం కంటే కంటితో చూడటమే దివ్యానుభూతి కలిగిస్తుంది.
శిల్పశాస్త్రంలో దేవతాశిల్పాలకు ఓ జాతిరాయిని, ఇతర విగ్రహాలను చెక్కేందుకు మరో జాతి శిల్పాలను ఎంచుకోవాలని ఉంది. యాదాద్రి ఆలయ దేవతామూర్తుల రూపకల్పనకు కృష్ణశిలను ఎంచుకోవడంలో ఆధ్యాత్మిక కోణం అద్భుతంగా ఇమిడిఉంది. ఆ శిల్పాలు ఎక్కడ ఎలా ఉంటే వాస్తుయుక్తమో, చూడచక్కదనమో చెప్పే ఆర్కిటెక్చర్ తన వందలాది డ్రాయింగ్‌ల రోల్స్‌తో నర్సింహాద్రి గుట్టనెక్కారు. అద్భుత శిల్పసంపదను నర్సింహాద్రి గుట్టపై నెలకొల్పారు.
ఇదీ చదవండి: తిరుమలలో కన్నులపండువగా శ్రీవారి తెప్పోత్సవం