ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పోక్సో కేసుల సత్వర విచారణకు ఏర్పాటైన ప్రత్యేక కోర్టుల పరిధి ఖరారు - scope extension of special courts

వివిధ జిల్లాల్లో ఏర్పాటైన 16 ప్రత్యేక కోర్టుల పరిధిని ప్రభుత్వం ఖరారు చేసింది. చిత్తూరు, తూర్పుగోదావరి, నెల్లూరు, ప్రకాశం, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, కర్నూలు, కడప, అనంతపురం జిల్లా కేంద్రాల్లో ఉన్న పోక్సో ప్రత్యేక న్యాయస్థానాలకు ఆ జిల్లా మొత్తం మీద పరిధి ఉంటుంది.

special courts for POCSO cases
పోక్సో కేసుల సత్వర విచారణకు ఏర్పాటైన ప్రత్యేక కోర్టుల పరిధి ఖరారు

By

Published : Jul 1, 2021, 10:54 PM IST

పోక్సో కేసుల సత్వర విచారణకు వివిధ జిల్లాల్లో ఏర్పాటైన 16 ప్రత్యేక న్యాయస్థానాల పరిధిని ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు న్యాయశాఖ కార్యదర్శి వి.సునీత ఆదేశాలు జారీ చేశారు. చిత్తూరు, తూర్పుగోదావరి, నెల్లూరు, ప్రకాశం, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, కర్నూలు, కడప, అనంతపురం జిల్లా కేంద్రాల్లో ఉన్న పోక్సో ప్రత్యేక న్యాయస్థానాలకు ఆ జిల్లా మొత్తం మీద పరిధి ఉంటుంది.

విజయవాడలోని ప్రత్యేక కోర్టు పరిధిలోకి మెట్రోపాలిటన్ ఏరియా, మచిలీపట్నం ప్రత్యేక కోర్టు పరిధిలోకి విజయవాడ మినహా మిగతా కృష్ణా జిల్లా, గుంటూరు పరిధిలోకి గుంటూరు, గురజాల, నరసరావుపేట రెవెన్యూ డివిజన్లు, తెనాలి ప్రత్యేక కోర్టు పరిధిలోకి తెనాలి రెవెన్యూ డివిజన్, ఏలూరు ప్రత్యేక కోర్టు పరిధిలోకి ఏలూరు, కొవ్వూరు రెవెన్యూ డివిజన్లు, భీమవరం పరిధిలోకి భీమవరం, నరసాపురం రెవెన్యూ డివిజన్లు వస్తాయని న్యాయశాఖ ఉత్తర్వుల్లో వెల్లడించింది.

ఇదీచదవండి.

YSR Bheema Scheme: పేదలను ఆదుకునేందుకు ఎప్పుడూ ముందుంటాం: సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details