ఈ నెల 16 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పష్టం చేశారు. సాధారణ పనివేళల్లోనే పాఠశాలలు నడుస్తాయని మంత్రి వెల్లడించారు. పాఠశాలల్లో కొవిడ్ నిబంధనలపై జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే 95 శాతం మంది ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్ పూర్తి చేశామని తెలిపారు. మిగిలిన వారికి కూడా టీకాలు వేయాలని ఆదేశించినట్లు మంత్రి స్పష్టం చేశారు.
SCHOOLS REOPEN: ఈ నెల 16 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం
ఈ నెల 16 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం
15:27 August 10
ఈ నెల 16 నుంచి ఆఫ్‌లైన్‌లోనే పాఠశాలల నిర్వహణ
రాష్ట్రంలో ఎక్కడా ఆన్‌లైన్ తరగతులు జరగట్లేదని.. ప్రైవేట్ పాఠశాలల్లోనూ ఆన్‌లైన్ తరగతులు వద్దని ఆదేశించినట్లు తెలిపారు. ఈ నెల 16 నుంచి ఆఫ్‌లైన్‌లోనే పాఠశాలలను నిర్వహిస్తామని మంత్రి స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:
LOANS: రాష్ట్రానికి ప్రభుత్వ బ్యాంకులు ఇచ్చిన రుణాల మొత్తం ఎంతంటే..!
Last Updated : Aug 10, 2021, 4:22 PM IST